
సాధారణంగా యుద్ధం వస్తే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. గత రెండ్రోజులు బంగారం, వెండి ధరలు పడిపోయాయి. కారణాలు ఏంటనేది పక్కనబెడితే, ఇది సామాన్యుడికి బిగ్ రిలీఫ్ అనుకున్నారు అందరూ. కానీ అంతలోనే ఎవరూ ఊహించని విధంగా మళ్లీ బంగారం ధరలు పుంజుకన్నాయి. శుక్రవారం కేవలం 4 గంటల్లోనే తులం బంగారంపై రూ. 650 పెరిగింది. ఇక సిల్వర్ మాత్రం కేజీ రూ.100 తగ్గి స్వల్ప ఊరటనిచ్చింది.

ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైరదాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,50,930గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,50,270, వద్ద స్థిరపడింది. అంటే జస్ట్ 4 గంటల్లోనే తులం బంగారంపై రూ.600లకు పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,38,350గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,37,740 వద్ద స్థరపడింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, కేరళ, పూణెలోనూ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,930గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,38,350వద్ద కొనసాగుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,51,080గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,50,420 వద్ద స్థరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,35,500లు గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,630గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,38,999 గా ఉంది.

ఇక వెండి విషయానికొస్తే కిలోపై ఏకంగా 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. తగ్గిన తర్వాత కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కేజీ సిల్వర్ ధర 2,45,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.