
గతవారం రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు గురువారం సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా బుధవారం ఒక్కరోజే బంగారంపై రూ.7000, వెండి పై రూ.5000 వరకు పెరిగి రెండు ఆల్‌టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. కానీ ఇవాళ మాత్రం రెండింటి ధరలు దిగొచ్చాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ బంగారంపై రూ.2000, వెండిపై రూ.5000 వరకు తగ్గింది.

భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో గురువారం ఉదయం 10 గంటలకు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం దర రూ.1,54,310 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,450 వద్ద స్థిరపడింది ఈ ధరలు వరుసగా గురువారం ఉదయం 6గంటలకు రూ.1,56,610, రూ.1,43,560గా ఉన్నాయి.

ఇక విజయవాడ, విశాఖ పట్నంలోని బంగారం ధరలు చూసుకుంటే ఈ రెండనగాల్లో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,310 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,450 వద్ద స్థిరపడింది.

ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ముందై, బెంగళూరు, కేరళ, పూణే, కోల్‌కతాలో సైతం హైదరాబాద్ తరహా రేట్లే కొనసాగుతుండగా మన దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,54,460గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,910 వద్ద కొనసాగుతుంది.

ఇక వెండి విషయానికి వస్తే ఇది కూడా పసిడి బాటలోనే నడుస్తుంది. కాకుంటే పసిడి మించి వెండి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. గురువారం బంగారం కేవలం రూ.2000 తగ్గితే వెండి మాత్రం ఏకంగా రూ.5000 తగ్గింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.3,25,000గా ఉండగా హైదరాబాద్‌లో మాత్రం కేజీ వెండి ధర రూ.3,40,000గా కొనసాగుతుంది.