
మానవ శరీరం కదలడానికి, సరిగ్గా పనిచేయడానికి ఎముకల ఆరోగ్యం ఎంతగానో ముఖ్యం. ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మనం నడవడం, పరిగెత్తడం, తినడం, మాట్లాడడం చేయగలం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, ఒక వ్యక్తికి సగటున రోజుకు 55 మైక్రోగ్రాముల (mcg) విటమిన్ K అవసరం.

కానీ చాలా మంది ఈ విషయాన్ని విస్మరిస్తూ జీవిస్తున్నారు.దీని వల్ల ఎముకల బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను దూరం చేసుకోవాలంటే కె విటమిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని 30 రోజుల పాటు తీసుకుంటే.. మీ ఎముకల ఆరోగ్యానికి, బలానికి అవసరమైన విటమిన్ K అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

కె విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనవి మునగ ఆకులు. వీటిని మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.100 గ్రాముల మనగాకు ద్వారా మనకు 600 మైక్రోగ్రాముల వరకు విటమిన్ K లభిస్తుంది. అందువల్ల, ఈ ఆకులను క్రమం తప్పకుండా తినడం వల్ల కాల్షియం శోషణ మెరుగుపడంతో పాటు ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది

మెంతి ఆకులు: విటమిన్ కె ఎక్కవగా ఉండే పదార్థాలలో మెంతి ఆకులు కూడా ఒకటి.100 గ్రాముల మెంతి ఆకులలో మనకు దాదాపు 180 మైక్రోగ్రాముల వరకు విటమిన్ కె లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, మెంతులు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Coriander leaves

పాలకూరలో ఇనుము మాత్రమే కాదు, విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. కేవలం 100 గ్రాముల వండిన పాలకూరలో, 483 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటుంది. పాలకూరలో ఉండే కె1, చిన్న చిన్న కె2 విటమిన్స్ ఎముకలకు మరింత రక్షణగా ఉంటుంది ఉంటాయి.