Garlic Oil For Hair: చుండ్రు బాధ వేదిస్తోందా? వెల్లుల్లి నూనె ఇలా ట్రై చేయండి..

Updated on: Dec 03, 2023 | 12:30 PM

ఉల్లిపాయలు జుట్టు సమస్యల నివారణలో ప్రభావవంతంగా పనిచేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ రసం నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఉల్లిపాయల మాదిరి వెల్లుల్లి కూడ జుట్టు సమస్యల నివారణలో దోహదపడుతుందని అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లి జుట్టు..

1 / 5
ఉల్లిపాయలు జుట్టు సమస్యల నివారణలో ప్రభావవంతంగా పనిచేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ రసం నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఉల్లిపాయల మాదిరి వెల్లుల్లి కూడ జుట్టు సమస్యల నివారణలో దోహదపడుతుందని అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లి జుట్టు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. వెల్లుల్లి నూనె జుట్టుకు పోషణనిచ్చి వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

2 / 5
వెల్లుల్లిలో సల్ఫర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. వెల్లుల్లి నూనె తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తుంది.

3 / 5
వెల్లుల్లి నూనెలో జుట్టు రాలడాన్ని తగ్గించే అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. వెల్లుల్లి నూనెను ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. చలికాలంలో చుండ్రు సమస్య సాధారణం. కానీ వెల్లుల్లి నూనె రాసుకోవడం వల్ల ఈ సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు. వెల్లుల్లి నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. చుండ్రు, తలపై దురద సమస్య నుండి ఉపశమనం కలిగించి, తలలో తేమను నిలుపుతుంది.

4 / 5
శీతాకాలంలో జుట్టు తేమ తగ్గడం వల్ల జుట్టు పొడిగా మారి, డల్‌గా కనిపిస్తుంది. అయితే వెల్లుల్లి నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనె జుట్టులో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. సాధారణంగా వెల్లుల్లి నూనె మార్కెట్‌లో లభించదు. కాబట్టి మీరు ఇంట్లోనే వెల్లుల్లి నూనెను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో వెల్లుల్లి నూనెను ఎలా తయారు చేయాలంటే..

5 / 5
కొబ్బరి నూనెతో కొన్ని వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను శీతాకాలపు ఎండలో ఉంచాలి. ఇలా కొన్ని రోజులు ఉంచితే గార్లిక్ ఆయిల్ తయారవుతుంది. మీరు షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు ఈ నూనెను అప్లై చేయవచ్చు. అలాగే ఈ నూనెను రాత్రిపూట జుట్టుకు కూడా రాసుకోవచ్చు.