1 / 6
ఊబకాయం నేటికాలంలో ప్రతి ఒక్కరినీ ఆందోళన కలిగిస్తుంది. ఊబకాయం గుండె జబ్బులను కూడా కలిగిస్తుంది. ఈధిక బరువు, కొవ్వు కూడా మరణానికి కారణమవుతాయి. అధిక బరువున్న వారు బరువు తగ్గడానికి రోజూ వ్యాయామం చేయాలి. చెమటలు పట్టించాలి. తినడం, త్రాగడం నుండి ఒత్తిడి వరకు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా బరువు పెరగడానికి ఒక కారణం. బరువు తగ్గాలంటే కాస్త వ్యాయామం చేయాలి. దానితోపాటు సరైన ఆహారం కూడా తీసుకోవడం అవసరం. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇలాంటి వాటిల్లో పచ్చి వెల్లుల్లి ముఖ్యమైనది. దీనిని ఆహారంలో చేర్చుకుంటే కొవ్వు తగ్గడం సులభతరం అవుతుంది.