
జుట్టు సమస్యలతో బాధపడేవారు ఎన్ని సౌందర్య సాధనాలను ఉపయోగించినా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. అయితే సహజ పద్ధతుల్లో జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

ఈ విషయంలో వెల్లుల్లి మీకు సహాయపడుతుంది. వెల్లుల్లి ఉపయోగించడం వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఏమిటో, వెల్లుల్లి జుట్టు రాలడాన్ని ఏ విధంగా నివారిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

వెల్లుల్లి జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో సెలీనియం ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి కూడా చుండ్రును నయం చేయడంలో సహాయపడుతుంది.

దీని రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది. సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన UV కిరణాలు జుట్టు సహజ కెరాటిన్‌ను గ్రహిస్తాయి. ఫలితంగా జుట్టు రాలిపోతుంది.

వెల్లుల్లి ఈ నష్టం నుండి జుట్టును రక్షిస్తుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా వెల్లుల్లి రసాన్ని జుట్టుకు రాసుకోవాలి. వెల్లుల్లి జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.