
కావాల్సిన పదార్ధాలు : అరకిలో చికెన్, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, మైదా పిండి, రెండు గుడ్డులు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, నూనె, 4 పచ్చిమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

ముందుగా చికెన్ తీసుకుని నీటిలో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటికి ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్ ను పట్టించి ఒక గిన్నెలో ఉంచాలి.

ఆ తర్వాత పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, చికెన్ ముక్కలను వేసి సన్నని మంటపై బంగారు రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచాలి.

ఇప్పుడు వేరే పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి, వెల్లుల్లి పేస్ట్ , కట్ చేసిన పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి దానిలో కొద్దిగా పెప్పర్ పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోండి చివర్లో దించే ముందు కొత్తిమీర వేసుకుని కిందకు దించేయండి.