తక్షణ శక్తి: అరటిపండ్లు తక్షణ శక్తిని అందించడంలో అగ్రస్థానంలో ఉంటాయి. వీటిలో ఉండే సహజ చక్కెరలు, ఫైబర్, శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందిస్తాయి. దాంతో అలసటను తగ్గిస్తాయి. అందుకే జిమ్‌కు వెళ్లేవారు, అథ్లెట్లు వ్యాయామానికి ముందు, తర్వాత వీటిని తీసుకోవడానికి ఇష్టపడతారు.

Banana

మానసిక ప్రశాంతత: అరటిపండ్లు కేవలం శరీరానికే కాదు, మనసుకూ మేలు చేస్తాయి. అరటిపండ్లలోని ట్రిప్టోఫాన్ అనే పదార్థం మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత సమస్య ఉన్నవారికి అరటిపండ్లు చాలా మంచివి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

రోగనిరోధక శక్తి: విటమిన్ బి6, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది. అదేవిధంగా అరటిపండ్లలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచి, ముడతలను తగ్గిస్తాయి. అలాగే బయోటిన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది.

చివరిగా అరటిపండ్లు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచివి. వీటిలోని విటమిన్ బి6, పొటాషియం, ఐరన్ వారి ఆరోగ్యానికి అవసరం, ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్ తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి రోజుకు రెండు అరటిపండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు.