
కోడి గుడ్లు ఎక్కువగా తినే వాళ్లకి ఇది షాక్ న్యూస్. ఇక నుంచి గుడ్ల పై కూడా ఎక్స్‌పైరీ డేట్ రాబోతోంది. మార్కెట్లో కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. దొరికినవి కదా అని ఇంట్లోకి తీసుకురాకండి. తెలియక నిల్వ ఉన్నవి తిని తిప్పలు తెచ్చుకోకండి.

ఎక్కడో కాదు పొరుగు రాష్ట్రంలో మరి కొద్దీ రోజుల్లో ఈ రూల్ అమలు కాబోతోంది. ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం ఈ రూల్ ను కఠినం చేయనున్నారు. పల్లెటూరి నుంచి పట్టణం వరకు.. చిన్న సరుకుల కొట్టు పెద్ద సూపర్ మార్కెట్స్ వరకు ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందే.

ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ప్రతి గుడ్డు మీద అది ఏ రోజున పెట్టింది? దీనిని ఎప్పటి వరకు తినాలి? అనే ముఖ్య విషయాలను కచ్చితంగా దాని మీద రాయాల్సిందే అని అర్ధం.

ఏప్రిల్ 1 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త రూల్ ను తీసుకురానుంది. కాబట్టి, మీరు కూడా ముందుగానే జాగ్రత్త పడితే చాలా మంచిది. అందరూ ఎగ్స్ తీసుకునేటప్పుడు గుడ్లపై ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేసి కొనుగోలు చేయండి.

నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఎగ్స్ 14 రోజుల వరకు మాత్రమే మంచిగా ఉంటాయి. ఇక తక్కువ ఉష్ణోగ్రతలో అయితే మూడు వారాలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత తినకూడదని చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)