
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అతడి మాజీ భార్య కిరణ్ రావు సైతం పాల్గొన్నారు. గతంలో కిరణ్ రావు దర్శకత్వం వహించిన 'ధోబీ ఘాట్' సినిమాను అమీర్ ఖాన్ నిర్మించారు. సుమారు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ‘లాపతా లేడీస్’ అనే సినిమా తీశారు. మరి వీరి కలయిక మరో సినిమా రావడానికి ఇన్నేళ్ల ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు కిరణ్ రావు సమాధామిచ్చారు. ‘ధోబీ ఘాట్’ విడుదలైన ఏడాదిలోనే కొడుకు ఆజాద్ పుట్టాడు. తల్లి కావాలనేది నా కల. అందుకే, ఆజాద్‌తో చాలా సమయం గడిపాను. ఈ కారణంగానే మరో సినిమా తీసేందుకు ఇంత టైం పట్టింది.’ అని కిరణ్ రావు అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ యోగా గురు 'గ్లోబల్ గురు' అనే సెషన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ9 ఏది చేసినా ఉత్తమమైనది మాత్రమే చేస్తుందని టీవీ9 నెట్‌వర్క్‌ను బాబా రామ్‌దేవ్ ప్రశంసించారు. సనాతన్ వారసత్వంతో దేశంలో నిరంతరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భారతదేశం అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ అవతరిస్తోందని చెప్పుకొచ్చారు.

టీవీ9 సమ్మిట్‌లో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన చిన్ననాటి కథలను వివరిస్తూ సమావేశంలో కూర్చున్న వ్యక్తుల జ్ఞాపకాలను రిఫ్రెష్ చేశారు. మీ నాన్న ఉపాధ్యాయుడైతే నీకు దెబ్బలు ఎక్కువ తగులుతాయంటూ చెప్పారు.. మనిషి ఇంకేదో ఆలోచిస్తాడని, దేవుడు అతడికి మార్గాన్ని సిద్ధం చేసే ఉంటాడని వివరించారు. చాలా సార్లు ఒక వ్యక్తి ఆలోచించని విధంగా చాలా పొందుతాడని.. ఇందంతా జీవితంలో జరుగుతూనే ఉంటుందని భగవంత్ మాన్ తెలిపారు.

ఇక సమ్మిట్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మోదీ ప్రభుత్వ విజయాల గురించి మాట్లాడారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ వారు రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోరని, అందుకే ఆయనపై నేను వ్యాఖ్యానించబోనంటూ తెలిపారు. అయితే తమ ప్రభుత్వం రైతులకు అనేక సౌకర్యాలు కల్పించిందని, ఆర్థిక సహాయంతో పాటు వారి ధాన్యాన్ని ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తున్నామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ మూడో రోజున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని తక్కువ అంచనా వేసి.. ఆటపట్టించే ఎవరినైనా కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పుల్వామా, డోక్లాం సంఘటనలకు భారత్ తగిన సమాధానం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.