vitamins
జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులపై పోరాడటానికి విటమిన్ డి శరీరానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ డి తీసుకోవడం కరోనావైరస్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పరిశోధకుల ప్రకారం.. విటమిన్ డి లోపం ఉన్న రోగులకు వైరస్‌కు ఎక్కువ అవకాశం ఉందని నివేదించారు. సూర్యకాంతి నుండి లభించే విటమిన్ డి కరోనాను నియంత్రిస్తుందని చెప్పారు.
మీరు కూడా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టయితే, మీరు మీ రోజువారీ ఆహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని చేర్చుకోవచ్చు.
చేపలు, గుడ్డు సొనలు, రెడ్ మీట్, పాలు, నారింజ, ఎండలో పెరిగిన పుట్టగొడుగులు, ఆకుకూరల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. ప్రాసెస్ చేసిన, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవద్దు.