
మామిడి పండును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ కొందరు దీన్ని పెరుగుతో కలిపి తింటారు. ఈ రెండు కలయికలు కలిసినప్పుడు శరీరంలో విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి శరీరంలో వేడిని కలిగిస్తుంది.

పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రెండు లక్షణాలు శరీరంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థలో సమస్య, చర్మంలో అలెర్జీ వస్తుంది. కాబట్టి మామిడి తిన్న తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత పెరుగు తినడం మంచిది.

మామిడి పండ్లను సిట్రస్ పండ్లు, పుల్లని రుచి కలిగిన వాటిని కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అవి శరీరం pH సమతుల్యతకు అంతరాయం కలిగిస్తాయి. మామిడి శరీరంపై వేడి ప్రభావాన్ని చూపుతుంది. దానిని పెరుగుతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. అలా తినకండి, ఎందుకంటే అది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.

మామిడి పండ్లను కూల్‌డ్రింక్స్‌తో కూడా కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. భోజనం తర్వాత మామిడి పండ్లు సరిగ్గా జీర్ణమయ్యేలా కొంత సమయం విరామం తీసుకుని తినండి. అలా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మామిడిపండు తిన్న వెంటనే, తినక ముందు స్పైసీ ఫుడ్ కూడా తినకూడదని అంటున్నారు. ఇలా తినటం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మామిడి పండ్లు తిన్న తర్వాత, తినక ముందు.. మంచి నీళ్లు తాగకూడదని చెబుతున్నారు.