
ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ అమ్మాయిలకు ఓ అగ్ని పరీక్ష లాంటివి. ప్రతి నెలా 4-5 రోజుల పాటు ఉంటే పీరియడ్స్ కొందరు అమ్మాయిలకు విపరీతమైన కడుపు నొప్పిని కలిగిస్తాయి. ఇది సాధారణ శారీరక ప్రక్రియ అయినప్పటికీ ఈ సమయంలో వచ్చే నొప్పి విపరీతమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక స్థితి కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. ప్రతి నెలా పెయిన్ కిల్లర్ మందులు తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందువల్ల ఈ సమయంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కొన్ని హోట్ రెమెడీస్ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ కింది మూడు రకాల సూప్‌లు తాగితే సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల శరీరంలో ఎలాంటి నొప్పి నుంచైనా వేగంగా తగ్గుతుంది. పీరియడ్స్ సమయంలో పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఇది గర్భాశయంలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీనితో పాటు పసుపు ఈస్ట్రోజెన్ హార్మోన్‌కు సహజ ఔషధం. ఈ హార్మోన్ ఋతుస్రావాన్ని నియంత్రించగలదు.

అవిసె గింజలు, చియా విత్తనాలు.. ఈ రెండు విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ రెండు రకాల విత్తనాలు పీరియడ్స్ క్రమరహిత సమస్యలను కూడా తొలగిస్తాయి. ప్రతి నెలా నిర్ణీత సమయంలో పీరియడ్స్ వస్తే.. క్రమేణా సమస్యలు తీవ్రత కూడా తగ్గుతుంది.

అల్లం – దాదాపు ప్రతి ఒక్కరి వంటగదిలో అల్లం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో అల్లంతో చేసిన టీ తాగడం మంచిది. దీనివల్ల నొప్పి చాలా వరకు తగ్గుతుంది. చాలా మందికి పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వికారం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమయంలో అల్లం టీ తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.