Heart Health: చామదుంపలో ఉండే ఈ గుణం ఆరోగ్యానికి వరం..! గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

|

Jun 10, 2024 | 8:23 PM

కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉండే చామదుంపలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి6, ఫోలేట్ మంచి మొత్తంలో ఉంటాయి. అంతే కాకుండా ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, మాంగనీస్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి చామ దుంపను తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
చామగడ్డ, లేదంటే చామదుంపగా పిలిచే.. ఈ కూరగాయలో మంచి మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. రూట్ వెజిటబుల్ చామగడ్డలో ఫైబర్,మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

2 / 5
చామదుంపలో లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే రోగాల బారిన పడకుండా ఉంటారు. చామదుంపలో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

3 / 5
చామదుంప అనేది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన కూరగాయ. దీని రెగ్యులర్ వినియోగం మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. ఎందుకంటే ఇందులో ఉండే పాలీఫెనాల్స్, యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ఫోలిక్ యాసిడ్, బీటా కెరోటిన్, ఐరన్ సమృద్ధిగా ఉండే చామ దుంపను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4 / 5
చామదుంపలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌లో తక్కువగా ఉంటుంది. ఇది గుండె-ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది ఆహారంలో సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది. చామగడ్డలో విటమిన్ సి, విటమిన్ ఎ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో, మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

5 / 5
ఈ దుంపలో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మధుమేహులకు చాలా మేలు జరుగుతుంది.. ఇన్సులిన్ స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్, ఇ విటమిన్, మెగ్నిషియం నిండి ఉంటుంది. ఈ పోషకాలను కలిగి ఉన్న చామ దుంపను తరచూ తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే బరువు తగ్గేందుకూ ఇది ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్న వారు తరచూ చామదుంపని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.