
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా అనేక రకాలైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వాటిల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. జుట్టు రాలే సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. జుట్టు రాలిన స్థానంలో మళ్లీ కొత్త జుట్టు రావడం లేదు. దీంతో జుట్టు పల్చగా.. అంద విహీనంగా మారుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలడానికి అనేక రకాలైన సమస్యలు ఉంటాయి.

విటమిన్ డి, విటమిన్ బి12 లోపం కారణంగా కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. సోయా బీన్స్, మీల్ మేకర్ వంటి ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

రక్త హీనత సమస్య వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. కాబట్టి ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. జుట్టు కుదళ్లకు పోషణ అనేది బాగా అందితే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

వీటితో పాటు బాదం పప్పును కూడా తీసుకోవాలి. జుట్టు ఎక్కువగా రాలే వారు ప్రతి రోజూ కనీసం 10 బాదం పప్పులను అయినా నానబెట్టి తింటూ ఉండాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే.. త్వరలోనే మార్పు కనిపిస్తుంది.

ముఖ్యంగా నీటిని అనేది ఎక్కువగా తాగుతూ ఉండాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల స్కాల్ఫ్‌పై రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు కుదళ్లు కూడా పొడి బారకుండా నిర్జీవంగా ఉంటాయి. జుట్టు చిట్లడం తగ్గుతుంది.