టీ, కాఫీ పొడి: చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అయితే జుట్టును నల్లగా మార్చడంలో కూడా టీ ఆకులు లేదా కాఫీ పొడి ఉపయోగపడుతుంది. ఇందుకోసం టీ లేదా కాఫీ చేసినట్లుగానే వీటి పొడిని తీసుకుని మరిగించాలి. చల్లార్చిన తర్వాత జుట్టుకు అప్లై చేసి 30 నిముషాల పాటు వదిలేయండి. ఆపై కడిగేస్తే చాలు.
ఉసిరి: జుట్టు సంరక్షణలో ఉసిరికి ప్రముఖ స్థానం ఉంది. ఈ క్రమంలో ఉసిరి జుట్టును నల్లగా కూడా చేస్తుంది. ఇందుకోసం మీరు ఉసిరి గింజలను మెత్తని పేస్ట్‌గా చేసి తలకు పట్టించి, వెంట్రుకల మూలాలను మసాజ్ చేయాలి. తర్వాత తలస్నానం చేస్తే చాలు, జుట్టు నల్లబడటం ప్రారంభమవుతుంది.
నల్ల జీలకర్ర: నల్లజీల కర్ర లేదా కలోంజి గింజలు సహజంగా జుట్టును నల్లగా మార్చడానికి మంచి రెమెడీ. ఇందులోని పోషకాలు జుట్టుకు మేలు చేసేవిగా ఉంటాయి. ఇక జుట్టును నల్లగా మార్చేందుకు కలోంజి గింజలను కొబ్బరి నూనెలో మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని కరివేపాకుతో మిక్స్ చేసి ఉడికించాలి. దీన్ని రాత్రిపూట తలకు పట్టించి, ఉదయాన్నే మీ జుట్టును కడిగితే చాలు.
ఉల్లిపాయ: ఉల్లిపాయ ఆరోగ్యానికే కాక అందానికి కూడా ప్రయోజనకరమే. ఈ కారణంగా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే నానుడి పుట్టుకొచ్చింది. ఇక ఉల్లిపాయతో నల్లని జుట్టు పొందేందుకు.. ముందుగా ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి 30 నిముషాల తర్వాత కడగాలి. ఉల్లిపాయలోని విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు కేశ సమస్యలను దూరం చేయడంతో పాటు నల్లగా కనిపించేలా చేస్తాయి.