Parenting Tips: పిల్లలు చదువులపై ధ్యాస పెట్టడంలేదా..? తల్లిదండ్రులు ఇలా చేస్తే మీ సమస్య ఫసక్..

|

Dec 26, 2022 | 6:15 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు సెల్ ఫోన్, గేమ్స్ కారణంగా తమ చదువులపై దృష్టి పెట్టడంలేదు. ఆ క్రమంలోనే చదవడం అంటే అదేదో భారమైన విషయంగా భావిస్తున్నారు. అది వారి భవిష్యత్తుకు మంచిదికాదు. అందువల్ల మీ పిల్లలు తమ చదువులపై దృష్టి సారించేలా చేయాలని మీరు భావిస్తే, ముందుగా వారిలో క్రమశిక్షణను పెంపొందించండి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ చాలా కీలకమవుతుంది. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు  సెల్ ఫోన్, గేమ్స్ కారణంగా తమ చదువులపై దృష్టి పెట్టడంలేదు. ఆ క్రమంలోనే చదవడం అంటే అదేదో భారమైన విషయంగా భావిస్తున్నారు.  అది వారి భవిష్యత్తుకు మంచిదికాదు. అందువల్ల మీ పిల్లలు తమ చదువులపై దృష్టి సారించేలా చేయాలని మీరు భావిస్తే, ముందుగా వారిలో క్రమశిక్షణను పెంపొందించండి.

2 / 5
పిల్లలలో క్రమశిక్షణ పెంపొందించేందుకు.. వారు చిన్నవయసులో ఉన్నప్పుడే సమయపాలనపై అవగాహన కల్పించండి. అందుకోసం వారికి ఒక టైమ్ టేబుల్ లాంటిదానిని రూపొందించి ఇవ్వండి. వారు దానిని క్రమం తప్పకుండా అనుసరించేలా జాగ్రత్తలు తీసుకోండి.

3 / 5
ప్రశాంతంగా చదువుకునేందుకు వారికి ప్రత్యేక గదిని, లేదా స్థలాన్ని కేటాయించండి. అవసరమైతే బెడ్ మీద కూర్చుని చదువుకునేందుకు కూడా అనుమతించండి. ఖాళీ సమయాల్లో ఆసక్తికరమైన నీతి కథలను చెబుతూ వారిలో ఉత్సాహాన్ని కలిగించండి. వారు చదువుకునే క్రమంలో మరో నియమాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే.. వారు కూర్చొని అలాగే చదువుతూ ఉండేలా కాకుండా మధ్యమధ్యలో విరామం ఇవ్వండి. అలా చేయడం వల్ల వారు చదువులపై విసుగు చెందకుండా ఉంటారు.

4 / 5
మీ దారిలోకి వారిని తెచ్చుకోవాలనుకున్నప్పుడు వారికి నచ్చిన పనులను కూడా మీరు చేయక తప్పదు. వారికి ఇష్టమైన వంటలు చేయడం, బొమ్మలు ఇవ్వడం వంటివి చేసి వారిలో ఉత్సుకతను పెంచండి. చదువు విషయంపై మీరు కూడా వారితో చర్చించండి. వారికి  అర్థంకాని విషయాలను వివరించడం, సూచనలు ఇవ్వడం వంటివి చేయండి.

5 / 5
Study Focus

Study Focus