AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు రాలిపోతుందా? అవిసె విత్తనాల జెల్‌తో పొడవైన, ఒత్తైన కురులను మీ సొంతం చేసుకోండి!

ప్రతి ఒక్కరి సౌందర్యంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తైన, నల్లటి, సిల్కీ, షైనింగ్ హెయిర్ అందరి సొంతం కావాలని కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల ఖరీదైన హెయిర్ క్రీమ్స్, షాంపూలను వాడుతుంటారు. కానీ రసాయనాలు నిండిన వాటికి బదులుగా వంటింటి చిట్కాలు మరియు సహజసిద్ధమైన పదార్థాలను వాడటం వల్ల జుట్టుకు ఎలాంటి హాని కలగదు. అలాంటి అద్భుతమైన ప్రాచీన చిట్కాల్లో అలసి విత్తనాలు ముందుంటాయి. ఈ గింజలతో తయారు చేసే జెల్ జుట్టుకు ఒక గొప్ప వరంలా పనిచేస్తుంది.

Jyothi Gadda
|

Updated on: Oct 26, 2026 | 1:25 PM

Share
అలసి విత్తనాల జెల్ తయారీ విధానం ఎలా?: అలసి గింజల జెల్ తయారు చేయడం చాలా సులభం. దీనికోసం కేవలం నీరు, అలసి గింజలు ఉంటే సరిపోతుంది. ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీటిని పోసి వేడి చేయాలి.
నీరు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో అర కప్పు అలసి గింజలను కలపాలి.

అలసి విత్తనాల జెల్ తయారీ విధానం ఎలా?: అలసి గింజల జెల్ తయారు చేయడం చాలా సులభం. దీనికోసం కేవలం నీరు, అలసి గింజలు ఉంటే సరిపోతుంది. ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీటిని పోసి వేడి చేయాలి. నీరు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో అర కప్పు అలసి గింజలను కలపాలి.

1 / 5
మధ్యస్థ మంటపై గింజలను కలుపుతూ మరిగించాలి. లేదంటే అవి గిన్నె అడుగున అంటుకుపోతాయి. కొద్దిసేపటికి నీరు చిక్కబడి జెల్ లాంటి మిశ్రమం తయారవుతుంది. మిశ్రమం చిక్కపడిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి, సుమారు 30 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా వస్త్రం సహాయంతో ఈ మిశ్రమాన్ని వడకడితే స్వచ్ఛమైన అలసి జెల్ సిద్ధమవుతుంది.

2 / 5
జుట్టుకు ఎలా అప్లై చేయాలి?: ఈ జెల్‌ను ఎల్లప్పుడూ శుభ్రమైన జుట్టుకు మాత్రమే అప్లై చేయాలి. వీలైతే ముందుగా మైల్డ్ షాంపూతో తలస్నానం చేసి, ఆరిన తర్వాత ఈ జెల్‌ను కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి. దీన్ని సుమారు 30 నిమిషాల నుంచి ఒక గంట పాటు అలానే ఉంచాలి. జుట్టు ఎక్కువగా ఉన్నవారు షవర్ క్యాప్ ధరించడం మంచిది. ఆ తర్వాత సాధారణ లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

3 / 5
అలసి జెల్ వల్ల కలిగే ప్రయోజనాలు: ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఈ జెల్‌ను క్రమం తప్పకుండా జుట్టుకు రాస్తుంటే పొడిబారిన మరియు నిర్జీవమైన జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టులో సహజమైన మెరుపు వస్తుంది. జుట్టు చిక్కులు పడటం తగ్గి, ఫ్రిజీనెస్‌ సమస్య అదుపులోకి వస్తుంది.

4 / 5
అలాగే జుట్టు ఒత్తుగా కనిపించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. సెలూన్లలో వేల రూపాయలు ఖర్చు పెట్టి హెయిర్ స్పా చేయించుకునే బదులు, ఇంట్లోనే ఈ నేచురల్ జెల్‌ను తయారు చేసుకుని అందమైన కురులను మీ సొంతం చేసుకోండి.

5 / 5
Follow Us