
పెళ్లి తరువాత ఫస్ట్‌నైట్(తొలిరాత్రి/శోభనం) అనేది మన దేశ వివాహ సంప్రదాయంలో ఒక భాగం. మొదటిరాత్రి సహజంగానే నూతన దంపతులకు చాలా అంచనాలు ఉంటాయి.

ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్‌లో పెద్దగా ఇబ్బందులు ఉండవు. అదే పెద్దలు కుదిర్చిన వివాహం అయితే, కొంచె జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

అరెంజ్ మ్యారేజ్‌లో ఏకైక సమస్య ఏంటంటే.. తక్కువ వ్యవధిలోనే ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేం. పెళ్లి అయిన మొదటి రాత్రి తమ భాగస్వామిని అర్థం చేసుకోవడం మొదటి అడుగు అవుతుంది.

ఈ మొదటి రాత్రి భార్య, భర్తలు సరదాగా తమ తమ విషయాలను పంచుకోవడం షరామామూలే. అయితే, ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కొత్త సంబంధంతో గతాన్ని పోల్చడం మానేయాలి. సమయాన్ని వృధా చేయవద్దు. మొదటిరాత్రి పాత, చేదు సంఘటనలను గుర్తుచేసుకుంటూ ప్రస్తుత క్షణాన్ని పాడు చేసుకోకండి.

కొత్త సంబంధంతో గతాన్ని పోల్చడం మానేయాలి. సమయాన్ని వృధా చేయవద్దు. మొదటిరాత్రి పాత, చేదు సంఘటనలను గుర్తుచేసుకుంటూ ప్రస్తుత క్షణాన్ని పాడు చేసుకోకండి.

కొత్త జంట.. మొదటి రాత్రి సన్నిహితంగా ఉండటం కొంచెం కష్టమే. కానీ విసుగుచెందకూడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. స్వేచ్ఛగా మాట్లాడుతూ.. ప్రేమగా ఉండాలి. ఫస్ట్ నైట్ మీ జీవిత గమనాన్ని సుఖమయం చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.