
సాధారణంగా కలలు వస్తూ ఉంటాయి. కలలో ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడికో వెళ్లినట్టు.. ఏదో చేస్తున్నట్టు వస్తుంది. కొన్ని కలలు నవ్వుతును తెప్పిస్తే.. మరి కొన్ని కలలు మాత్రం చాలా భయానకంగా వస్తాయి. దీంతో కలలు అంటేనే చాలా మంది భయ పడుతూ ఉంటారు.

మరికొంత మంది ఎలాంటి కల వచ్చిన ఏం జరుగుతుందో.. ఎలాంటి సంఘటనలను ఎదురువుతాయోనని టెన్షన్ పడుతూ ఉంటారుజ ఇలా కలలో వచ్చే వాటిల్లో నీళ్లు కూడా ఒకటి.

కలలో పారుతున్న నీళ్లు కనిపిప్తే మాత్రం మీకు శుభం జరుగుతుంది. కానీ సముంద్రం కనిపించి.. అలలు ఎగిసి పడుతూ ఉంటే మాత్రం.. ఏదో ఆందోళనకర సమస్య ఎదురువుతుందని అర్థం చేసుకోవచ్చు.

అలాగే కలలో వరద వస్తున్నట్టు.. వరద నీళ్లు కనిపిస్తే మాత్రం త్వరలోనే చెడు వార్త వింటారని సంకేతం. అదే విధంగా కలలో మాత్రం వర్షం కనిపిస్తూ ఉంటే మాత్రం దాన్ని శుభ సంకేతంగా భావించవచ్చు.

చెరువుల్లో, కొలనులో నీరు ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా, అందంగా నీరు కనిపిస్తే.. మీ జీవితం కూడా అలా ప్రశాంతంగా ముందుకు సాగబోతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే బావిలో నీరు పెరుగుతున్నట్టు కల వచ్చినా మంచి జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.