Weight Loss Tips: బరువు తగ్గాలని ప్రయత్నించి విఫలం అవుతున్నారా.. ఈ 5 సుగంధ ద్రవ్యాలతో బరువు సమస్య పరార్..

|

Aug 23, 2023 | 9:14 AM

బరువు తగ్గాలని చాలామంది ప్రయత్నిస్తారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అది సాధ్యం కాదు. బరువు తగ్గడం అనేది సమతుల్య ఆహారం, వ్యాయామం ఫలితంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు లేకుండా భారతీయ ఆహారం అసంపూర్ణం. అవి మీ ఆహారంలో రుచిని పెంచడమే కాదు బరువు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలు సహజ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కూడా తోడ్పడుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మసాలా దినుసుల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1 / 6

2 / 6
పసుపు: పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పసుపును కరివేపాకుతో పాటు మరిగించి తీసుకుంటే చాలా మంచిది. బెల్లీ ఫ్యాట్‌ని కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.

3 / 6
Cinnamon

Cinnamon

4 / 6
సోంపు గింజలు: చాలా మంది తిన్న తర్వాత సోంపు వేసుకునే అలవాటు ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు మంచిది. ఉదయం సమయంలో నీటిలో వేసి మరిగించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సోంపులో విటమిన్లు ఎ, సి, డి, యాంటీ-ఆక్సిడెంట్ల మంచి మూలం ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5 / 6
జీలకర్ర: జీలకర్ర అనేది సాధారణం మసాలా. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతి రాత్రి ఒక టీస్పూన్ జీలకర్రను నానబెట్టి ఉదయం నీటిలో కలిపి తాగండి. ఇది బెల్లీ ఫ్యాట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు దీనిని సూప్స్, పప్పు, కూరలలో కూడా ఉపయోగించవచ్చు.

6 / 6
మెంతులు: మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. మీ ఆహారంలో కొవ్వు, కేలరీల మొత్తాన్ని తగ్గించడంలో మెంతి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు మెంతులను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.