
జ్యోతిష్యశాస్త్రంలో సూర్యగ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఖగోళ పరంగా సహజ సంఘటన అయినప్పటికీ.. వేద జ్యోతిష్యం ప్రకారం దీని ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై పడుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండగా, మరికొన్నిటికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 సంవత్సరంలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. ఒకటి ఫిబ్రవరిలో మరొకటి ఆగస్టులో సంభవించనున్నాయి. తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి నెలలో రానుంది. తొలి సూర్య గ్రహణం కారణంగా పలు రాశులవారికి అదృష్ట ఫలితాలు కలగనున్నాయి. శుభ ఫలితాలు పొందనున్న ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తొలి సూర్యగ్రహణం ఎప్పుడు? ఫిబ్రవరి 17, 2026 (మంగళవారం) ఫాల్గుణ అమావాస్య రోజున సంవత్సరంలోని తొలి సూర్యగ్రహణం సంభవిస్తుంది. గ్రహణం ప్రారంభం: సాయంత్రం 05:26 గంటలకు గ్రహణం ముగింపు: రాత్రి 07:57 గంటలకు, అయితే, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతకం కాలం వర్తించదు. ఈ సూర్యగ్రహణం శని రాశి అయిన కుంభ రాశిలో సంభవించనుంది. గ్రహణ సమయంలో సూర్యుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కొన్ని రాశులకు ఇది అనుకూల ఫలితాలను అందించనుంది.

మేష రాశి.. ఫిబ్రవరి 17న జరిగే సూర్యగ్రహణం మేష రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారం, కెరీర్‌లో పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఏ పనులు ప్రారంభించిన విజయం అందుకుంటారు.

వృషభ రాశి.. వృషభ రాశి వారికి ఈ సూర్యగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌లో లాభాలు పొందుతారు. విద్యార్థులకు అనుకూల కాలం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగంలో అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మానసిక ప్రశాంత లభిస్తుంది.

మిథున రాశి.. మిథున రాశి వారికి ఈ గ్రహణం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు పొందుతారు. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మీకు మీ కుటుంబ మద్దతు లభిస్తుంది. వ్యాపారం, వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ సూర్యగ్రహణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం, వ్యాపారంలో లాభాలు ఉంటతాయి. విదేశీ ప్రయాణ యోగం ఉంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. 2026లో సంభవించే తొలి సూర్యగ్రహణం కుంభ రాశిలో జరగడం వల్ల, మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులకు ప్రత్యేకంగా విజయం, పురోగతి, ఆర్థిక లాభాలు తీసుకురావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. (Declaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)