
కొంతమందికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేకపోయినా ఫ్యాటీ లివర్ బారీన పడుతుంటారు. అందుకే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే రెండు రకాల ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నేటికాలంలో ప్రతి 10 మందిలో 6 మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. బయటి ఆహారం తినే అలవాటు, వ్యాయామం పట్ల విముఖత ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుంది. ఇంట్లోనే సజహ పద్ధతుల్లో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అజీర్ణం, నిరంతర గ్యాస్-గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటివి ఫ్యాటీ లివర్ లక్షణాలు. ప్రారంభ దశలో ఫ్యాటీ లివర్ లక్షణాలు బయటపడవు. గుర్తించే సమయానికి చాలా ఆలస్యం అయిపోతుంది.

మీరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నట్లయితే ఏమి తినాలి, ఏం తాగాలి అనే దానిపై అవగాహన ఉండాలి. ముందుగా మద్యపానం జోలికి అస్సలు వెల్లకూడదు. అంతేకాకుండా ఆహారంలో నూనె, మసాలాలు తగ్గించాలి. బయటి ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఫ్యాటీ లివర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఎక్కువ కూరగాయలు, ధాన్యాలు తినాలి.

కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయానికి మేలు చేస్తాయి. తృణధాన్యాలలో ఉండే ఫైబర్ ఫ్యాటీ లివర్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొవ్వు కాలేయాన్ని వదిలించుకోవడానికి పుదీనా, లెమన్‌గ్రాస్, అల్లం పానీయాలను తయారు చేసుకుని సేవించాలి. పుదీనా, లెమన్ గ్రాస్, అల్లం వేసి వేడి నీళ్లతో మరిగించి తయారు చేసిన పానీయం ఫ్యాటీ లివర్ సమస్యలను తగ్గిస్తుంది.

పుదీనా ఆకుల్లో మెన్హాల్ ఉంటుంది. ఇది కాలేయాన్ని రక్షిస్తుంది. ఈ పదార్ధం కాలేయంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది. నిమ్మకాయలో సిట్రల్ ఉంటుంది. ఇది కాలేయం దెబ్బతినకుండా నివారిస్తుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫ్యాటీ లివర్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. పుదీనా, లెమన్ గ్రాస్, అల్లం పానీయాలు ఫ్యాటీ లివర్ సమస్యలతో పాటు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయి.