Fastrack Reflex Play+: ఫాస్ట్రాక్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో తొలి స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది..

|

Aug 30, 2022 | 11:04 AM

Fastrack Reflex Play+: వాచ్‌ల తయారీకి పెట్టింది పేరైన ప్రముఖ కంపెనీ ఫాస్ట్రాక్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఫాస్ట్రాక్‌ రిఫ్లెక్స్‌ ప్లే + పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ ఉండడం విశేషం. వాచ్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
వాచ్‌ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఫాస్ట్రాక్‌ స్మార్ట్‌ వాచ్‌ల రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్లూటూత్‌ కాలింగ్‌తో కూడిన తొలి స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొచ్చింది.

2 / 5
ఫాస్ట్రాక్‌ రిఫ్లెక్స్‌ ప్లే ప్లస్‌ పేరుతో లాంచ్‌ చేసినఈ స్మార్ట్‌వాచ్‌ను సర్క్యులర్ షేప్ డిజైన్ AMOLED డిస్‌ప్లే, అల్యూమినియమ్ కేస్‌తో రూపొందించారు. బ్లూటూత్‌ కాలింగ్‌ కోసం ఇందులో ఇన్‌బుల్ట్‌ స్పీకర్‌, మైక్‌ను అందించారు.

3 / 5
ఈ వాచ్‌లో హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ ట్రాకర్(SpO2), బ్లడ్ ప్లజర్ మానిటరింగ్‌తో పాటు మరికొన్ని హెల్త్‌ ఫీచర్లను అందించారు.

4 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌ను ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఏడు రోజుల నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. వర్కౌట్స్‌ సంబంధించిన పలు అధునాతన ఫీచర్లు ఈ వాచ్‌ సొంతం.

5 / 5
ధర విషయానికొస్తే ఫాస్ట్రాక్‌ రిఫ్లెక్స్‌ ప్లే + వాచ్‌ ధర రూ. 6,995గా ఉంది. ఫాస్ట్రాక్‌ వెబ్‌సైట్‌తో పాటు, ఫాస్ట్రాక్‌ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంది.