Beauty Tips: ముఖం కడిగిన వెంటనే ఇలా చేస్తే మేకప్ లేకున్నా మీ ఫేస్ మెరిసిపోవడం పక్కా..

Updated on: Jul 25, 2026 | 4:40 PM

ముఖం కడిగిన వెంటనే టవల్‌తో తుడుచుకుని అలా వదిలేస్తున్నారా? అయితే మీరు చర్మ సంరక్షణలో చాలా పెద్ద తప్పే చేస్తున్నారు.. ఫేస్‌వాష్ చేసిన తర్వాత ఉండే మొదటి కొన్ని నిమిషాలు చర్మానికి అత్యంత కీలకమైనవి. ముఖం కడిగినప్పుడు దుమ్ము, ధూళితో పాటు చర్మానికి ఉండే సహజ సిద్ధమైన తేమకూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం పొడిబారి, కాంతిహీనంగా మారే ప్రమాదం ఉందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
ఫేస్‌వాష్ చేసిన వెంటనే ముఖాన్ని టవల్‌తో గట్టిగా రుద్దకూడదు. ఇలా చేయడం వల్ల చర్మంపై మంట, పొడిబారడం పెరుగుతాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు టవల్‌తో గట్టిగా తుడువకుండా, తేలికగా అద్దుతూ నీటిని తుడవాలి. ఒకవేళ మీ చర్మం పొడిబారినట్లు అనిపిస్తే, గ్లిజరిన్ లేదా హైడ్రేటింగ్ టోనర్ వాడటం మంచిది. అయి, ఎక్కువ ఆల్కహాల్ ఉండే టోనర్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

2 / 5
ముఖం తుడుచుకున్న తర్వాత చర్మ తత్వానికి తగినట్లుగా సంరక్షణ చర్యలు ప్రారంభించాలి. ఒకవేళ మీది పొడి చర్మం అయితే ఫేస్‌వాష్ తర్వాత తేమను అందించే హైడ్రేటింగ్ టోనర్ లేదా ఎస్సెన్స్ వాడటం మంచిది. గ్లిజరిన్, హైలురోనిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉన్న టోనర్లు చర్మంలో తేమను పట్టి ఉంచుతాయి. అయితే అధిక ఆల్కహాల్ ఉన్న టోనర్లను వాడితే చర్మం మరింత పొడిబారే ప్రమాదం ఉంది.

3 / 5
టోనర్ తర్వాత చర్మ అవసరాలకు అనుగుణంగా సీరమ్ ఉపయోగించడం సరైన సమయం. శుభ్రపడిన చర్మంపై సీరమ్‌లోని పోషకాలు చాలా వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. దీనివల్ల చర్మానికి అవసరమైన విటమిన్లు, పోషణ సరిగ్గా అందుతాయి. అయితే ప్రతి ఒక్కరూ తమ చర్మ స్వభావాన్ని బట్టి నిపుణుల సలహాతో సరిపడే సీరమ్‌ను మాత్రమే ఎంచుకోవాలి.

4 / 5
ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది మాయిశ్చరైజర్. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి మోయిశ్చరైజర్ అవసరం లేదనుకోవడం సరికాదు. చర్మ తత్వం ఏదైనా సరే మాయిశ్చరైజర్ తప్పనిసరి. ఇది చర్మంలోని తేమను బయటకు పోకుండా లాక్ చేసి, స్కిన్ బారియర్‌ను బలంగా ఉంచుతుంది. ఒకవేళ ఇది ఉదయం వేళ చేసుకునే స్కిన్‌కేర్ రొటీన్ అయితే మాయిశ్చరైజర్ తర్వాత SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ అప్లై చేయడం అస్సలు మర్చిపోకూడదు.

5 / 5
చివరగా ఫేస్‌వాష్ చేసిన వెంటనే నిమ్మకాయ, బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ వంటి ఘాటైన గృహ వైద్యాలను నేరుగా ముఖానికి రాయకూడదు. వీటివల్ల చర్మం కాలిపోవడం, అలెర్జీలు రావడం మరియు చర్మపు పొర దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. ముఖం కడిగిన తర్వాత సరైన క్రమంలో, తగిన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తే మీ చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

Follow Us