
తులసి ఆకులు ఉదరానికి అమృతం లాంటివి. ఇవి గుండెల్లో మంట, అజీర్ణం, అసిడిటీ వంటి పలు ఉదర సంబంధిత సమస్యల నుంచి చిటికెలో ఉపశమనం కలిగిస్తుంది. ఇవి పలు శారీరక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరంలో pH స్థాయులను క్రమబద్ధీకరించడంలో సమర్థంగా తోడ్పడుతాయి.

ఇక చలికాలంలో తులసి ఆకులతో బోలెడు ప్రయోజనాలున్నాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమిలితే జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యల నుండి విముక్తి పొందుతారు.

తులసి ఆకులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఖాళీ కడుపుతో తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే గుండెపోటు వంటి వ్యాధులను నివారిస్తాయి.

తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపు సమస్యలు రావు. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొత్తికడుపు సమస్యలు తగ్గుతాయి. అంతే కాదు, ఈ ఆకులు ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం, పుల్లని త్రేనుపు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

ప్రతి రోజూ ఉదయం తులసి ఆకులను నమలడం వల్ల చర్మం మెరిసిపోతుంది. తులసి ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి శుభ్రపరుస్తాయి. మొటిమలను నివారిస్తాయి. నోటి దుర్వాసన సమస్యలతో బాధపడుతున్నవారు తులసి ఆకులను క్రమం తప్పకుండా తినండి.