Eggs Side Effects: ఆరోగ్యానికి మంచిదికదా అని ఎప్పుడుపడితే అప్పుడు గుడ్డు తినకూడదట.. ఈ టైంలో తీసుకుంటే యమ డేంజర్‌!

|

Jun 18, 2024 | 1:32 PM

చాలా మందికి ఇష్టమైన ఆహారాల్లో గుడ్లు ముఖ్యమైనవి. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే పిల్లలు, వృద్ధులు, రోగులతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిని గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇందులో మాంసకృత్తులతో పాటు, ఫోలేట్, జింక్, కాల్షియం, విటమిన్లు-ఎ, ఇ, డి, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా..

1 / 5
చాలా మందికి ఇష్టమైన ఆహారాల్లో గుడ్లు ముఖ్యమైనవి. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే పిల్లలు, వృద్ధులు, రోగులతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిని గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

2 / 5
ఇందులో మాంసకృత్తులతో పాటు, ఫోలేట్, జింక్, కాల్షియం, విటమిన్లు-ఎ, ఇ, డి, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

3 / 5
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి గుడ్లు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంచడం, ఎముకలు, కండరాలను బలోపేతం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే వేసవిలో మాత్రం గుడ్లు చాలా జాగ్రత్తగా తినాలంటున్నారు నిపుణులు.

4 / 5
విపరీతమైన వేడిలో గుడ్లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి వేసవిలో గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. చెడిపోయిన గుడ్లను పొరపాటున తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వాటిని కొనుగోలు చేసే ముందు గుడ్లను పరీక్షించి తీసుకోవాలి.

5 / 5
గుడ్డును నీటిలో వేసినప్పుడు.. నీటిలో పైకి తేలడం ప్రారంభిస్తే, అది చెడిపోయిందని అర్ధం. ఇలాంటివి ఆరోగ్యానికి హానికరం. అలాగే గుడ్డు పచ్చ సొనలో చాలా కొవ్వు ఉంటుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజూ గుడ్డు తినకపోవడం మంచిది. లేకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు. వేడి వాతావరణంలో ఒకటి లేదా రెండు గుడ్ల కంటే ఎక్కువ తినకుండా ఉండాలి. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా అజీర్ణం, విరేచనాలు, వాంతులు అవుతాయి. అలాగే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, మైకం రావడం వంటివి జరుగుతాయి. అందుకే వేసవిలో గుడ్లు తినకూడదు.