పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. జ్ఞాపకశక్తిని పెంచే సైంటిఫిక్ పద్ధతులు

Updated on: Apr 27, 2026 | 8:28 PM

చాలామంది విద్యార్థులు రాత్రంతా కష్టపడి చదివినా, పరీక్ష పేపర్ చూడగానే సమాధానాలు గుర్తుకు రాక తల పట్టుకుంటారు. "చదివింది బుర్రకెక్కడం లేదు" అని బాధపడేవారికి సైన్స్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతోంది. అదే యాక్టివ్ రీకాల్ (Active Recall) మరియు స్పేస్డ్ రిపిటీషన్ (Spaced Repetition). ఈ రెండు పద్ధతులు పాటిస్తే ఎంతటి కష్టమైన సబ్జెక్ట్ అయినా చిటికెలో గుర్తుండిపోతుంది.

1 / 6
యాక్టివ్ రీకాల్, స్పేస్డ్ రిపిటీషన్: ఎంతోమంది విద్యార్థులు రాత్రంతా కష్టపడి చదివినా, పరీక్షలలో క్వశ్చన్ పేపర్ చూడగానే సమాధానాలు గుర్తుకు రాక ఇబ్బందులు పడుతుంటారు. చదివింది మర్చిపోవడం, ఎన్ని గంటలు చదివినా బుర్రలోకి ఎక్కకపోవడం వంటి సమస్యలు వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే, ఈ సమస్యకు పరిష్కారం లేదు అనుకోవడం పొరపాటు. యాక్టివ్ రీకాల్ (Active Recall) మరియు స్పేస్డ్ రిపిటీషన్ (Spaced Repetition) అనే రెండు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడం ద్వారా చదివిన ప్రతి విషయం జీవితాంతం గుర్తుంటుంది. ఈ పద్ధతులు విద్యార్థులను పరీక్షలలో టాపర్‌లుగా నిలబెట్టగలవు.

2 / 6
ఇల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్ ను అధిగమించడం: సాధారణంగా విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ హైలైట్ చేయడం, పదిసార్లు పైకి చదవడం, వీడియో క్లాసులు చూడటం వంటి పద్ధతులను అవలంబిస్తారు. ఇవి చదువుతున్నామనే సంతృప్తిని ఇస్తాయి కానీ, నిజానికి ఇల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్ను సృష్టిస్తాయి. అంటే, అన్నీ గుర్తుకు ఉన్నాయని భ్రమ పడతారు. పుస్తకం తెరిచి ఉన్నప్పుడు అన్నీ అర్థమైనట్లు అనిపించినా, మూసిన తర్వాత ఏమీ గుర్తురాదు. మెదడు ఒక డస్ట్‌బిన్ కాదు; అది ముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే నిల్వ చేస్తుంది. కేవలం కళ్ళతో చూస్తూ, పైకి చదువుతూ వెళ్తే, మెదడు దాన్ని అనవసరమైన సమాచారంగా భావించి మర్చిపోతుంది. అందుకే, ఎంత కష్టపడి చదివినా 24 గంటల్లో 70% సమాచారాన్ని కోల్పోతాము.

3 / 6
యాక్టివ్ రీకాల్: టాపర్‌లు మాయ చేయరు, వారు ఈ రెండు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తారు. మొదటిది యాక్టివ్ రీకాల్. ఇది పాసివ్ రీడింగ్ (కేవలం చదవడం)కు వ్యతిరేకం. యాక్టివ్ రీకాల్ అంటే మెదడుకు పని చెప్పడం, సమాచారాన్ని కష్టపడి గుర్తుచేసుకోవడం. జిమ్‌లో కండరాలకు బరువులు ఎత్తడం ద్వారా అవి బలపడినట్లే, మెదడుకు కూడా కష్టపెడితేనే అది బలపడుతుంది. చదువు అనేది సమాచారాన్ని మెదడులోకి పంపించడం (ఇన్‌పుట్), అయితే పరీక్షలలో చేయాల్సింది మెదడులో ఉన్న సమాచారాన్ని బయటకు తీయడం (అవుట్‌పుట్). చాలామంది అవుట్‌పుట్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే పరీక్షలలో విఫలమవుతారు.

4 / 6
యాక్టివ్ రీకాల్‌ను ఎలా అమలు చేయాలంటే:  ఒక టాపిక్‌ను లేదా పేజీని పూర్తి ఏకాగ్రతతో ఒక్కసారి చదవండి. తరువాత పుస్తకాన్ని మూసివేయండి.  ఒక ఖాళీ కాగితంపై చదివిన మెయిన్ పాయింట్స్ అన్నీ చూడకుండా రాయండి (బ్లర్టింగ్ పద్ధతి). లేదా ఆ టాపిక్‌ను ఎవరికైనా వివరిస్తున్నట్లు గట్టిగా చెప్పుకోండి. ఈ ప్రక్రియ కష్టంగా అనిపించినా, మెదడుకు ఒత్తిడి కలిగించినప్పుడే కొత్త న్యూరాన్లు అనుసంధానమై సమాచారం బలంగా ఫిక్స్ అవుతుంది. ఒక గంట పాసివ్ రీడింగ్ చేసే బదులు 10 నిమిషాలు యాక్టివ్ రీకాల్ చేస్తే, వంద రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

5 / 6
స్పేస్డ్ రిపిటీషన్: యాక్టివ్ రీకాల్ ద్వారా గుర్తుపెట్టుకున్నా, మెదడుకు మర్చిపోయే గుణం ఉంటుంది. జర్మన్ సైంటిస్ట్ హెర్మన్ ఎబ్బింగ్‌హాస్ 1885లో కనుగొన్న ఫర్గెట్టింగ్ కర్వ్ ప్రకారం, మనం చదివిన 70% సమాచారం 24 గంటల్లో, ఒక వారం తర్వాత 90% సమాచారం మర్చిపోతాం. దీన్ని అధిగమించడానికి స్పేస్డ్ రిపిటీషన్ సహాయపడుతుంది. ఇది మెదడుకు సమయ వ్యవధి ఇచ్చి, క్రమబద్ధంగా రివిజన్ చేసే పద్ధతి. చిన్న మామిడి మొక్కకు ఒకేసారి పది బిందెల నీళ్లు పోయకుండా, రోజూ కొద్దికొద్దిగా పోసినప్పుడే అది పెద్ద వృక్షమవుతుంది. మెదడుకు కూడా అంతే.

6 / 6
డెడ్లీ కాంబినేషన్ స్ట్రాటజీ: కేవలం యాక్టివ్ రీకాల్ లేదా స్పేస్డ్ రిపిటీషన్ మాత్రమే కాకుండా, ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడం కీలకమైనది. రివిజన్ చేసేటప్పుడు పుస్తకాలు తెరిచి చదవకుండా, యాక్టివ్ రీకాల్ పద్ధతిని వాడాలి. అంటే, రివిజన్ సమయంలో కేవలం టాపిక్ పేరు చూసి, నీకు నువ్వే గట్టిగా చెప్పుకోవడం లేదా కాగితంపై రాయడం చేయాలి. తర్వాత పుస్తకం తెరిచి, రాసిన దాన్ని సరిచూసుకోవాలి. తప్పులను గుర్తించి, వాటిని మళ్ళీ మెదడుకు ఎక్కించుకోవాలి. ఇలా క్రమబద్ధంగా చేయడం ద్వారా మెదడుకు ఆ సమాచారం చాలా ముఖ్యమని తెలిసి, దాన్ని పర్మనెంట్‌గా స్టోర్ చేస్తుంది.

Follow Us