జామ కాయలో రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందరూ ఎక్కుగా వైట్ అండ్ పింక్ కలర్ లో ఉండే జామ కాయలను తింటూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో కూడా ఎక్కువగా గులాభి రంగులో ఉండే జామ కాయలే మార్కెట్లో లభిస్తున్నాయి. నల్ల జామ కాయలు కడా ఉంటాయి కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా కనిపించవు.
పింక్ కలర్ జామ కాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగులో ఉండే జామ తినడం వల్ల పలు రకాల వ్యాధులు అదుపులో ఉంటాయని అంటున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.
పింక్ కలర్ జామకాయ తినడం వల్ల చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. జామకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు, గీతలు వంటివి ఏర్పడవు.
పింక్ జామలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా మెదడు పని తీరు కూడా బావుంటుంది. ఇది తినడం వల్ల రక్త పోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
అలాగే పింక్ జామ తినడం వల్ల చెడు కొలెస్ట్రాలో తగ్గుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు గులాభి రంగులో ఉండే జామకాయ తినడం వల్ల బరువు అనేది అదుపులో ఉంటుంది. అంతే కాకుండా ఇది కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది.