పచ్చి బఠానీల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, విటమిన్ బి6, మెగ్నీషియం, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పచ్చిబఠానీలు ఆరోగ్యపరంగా అన్ని వయసులో వారు తినవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.