Dark Chocolate Benefits : డార్క్ చాక్లెట్..ప్రతిరోజూ కొద్దిగా తినండి చాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

| Edited By: Ravi Kiran

Oct 10, 2024 | 9:39 PM

డార్క్ చాక్లెట్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరూరిపోతుంది. అయితే, డార్క్‌చాక్లెట్‌ రుచిలో మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే ప్రతిరోజూ ఒక డార్క్ చాక్లెట్ తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. డార్క్ చాక్లెట్‌‌తో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
డార్క్ చాక్లెట్ తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు ఆందోళన వంటి సమస్యలను నివారించవచ్చు. మానసికంగా ఎంతో ఆనందాన్ని కూడా పొందవచ్చునని అధ్యయనం తేల్చింది.

2 / 5
డార్క్ చాక్లెట్‌లో ఫెనిలేథైలమైన్ వంటి సైకోయాక్టివ్ పదార్థాలు ఉంటాయి. వీటిలో మానసిక స్థితిని నియంత్రించే న్యూరోమోడ్యులేటర్ ఉంటుది. చాక్లెట్ తినేవారిలో చాలా కాలం తర్వాత మానసిక స్థితి మెరుగుపడినట్టు గుర్తించారు.

3 / 5
ప్రతిరోజూ కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ తినే వారిలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించినట్టు పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు.. బరువు, శరీర కొవ్వు కూడా తగ్గినట్టు గుర్తించారు.

4 / 5
డార్క్ చాక్లెట్ రోజుకు అర ఔన్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ మొత్తానికి మించి తీసుకున్నా పెద్దగా ప్రభావం కనిపించలేదు. అలాగే, గుండె సంబంధ వ్యాధుల నివారణ అధ్యయనంలో కూడా 0.7 నుంచి 1.5 ఔన్సుల మధ్య తీసుకున్నారు.

5 / 5
కొన్ని డార్క్ చాక్లెట్‌లు రుచికి బాగుంటాయి. వీటిలో 40 శాతం కోకో సాలిడ్‌లు ఉంటాయి. అందుకే డార్క్ చాక్లెట్‌ డార్క్‌గా కనిపించడానికి కారణంగా చెప్పవచ్చు. అధ్యయనాల్లో కనీసం 60 శాతం కోకో ఘనపదార్థాలను కలిగిన డార్క్ చాక్లెట్ నుంచి అతిపెద్ద ప్రయోజనాలను పొందవచ్చునని తేలింది.