Anjeer Health Benefits: అంజీర్​లను ఇలా తీసుకుంటే ఒంట్లో షుగర్​ దెబ్బకు నార్మల్..​! మరెన్నో లాభాలు..

|

Sep 12, 2024 | 8:50 PM

ప్రస్తుతం డయాబెటిక్‌ చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ బాధిస్తోంది. ఇది ఒక్కసారి ఎటాక్‌ చేసిందంటే.. ఇక జీవితాంతం మందులు తప్పక వాడాల్సిందే! అందుకే దీనిని నివారించుకునేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే డయాబెటిస్​ను కంట్రోల్లో ఉంచుకునేందుకు అంజీర్​లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సమయంలో తింటే ఊహించని ఫలితాలు లభిస్తాయని అంటున్నారు. అంజీర్​ ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
రోజూ రెండు అంజీర్​ పండ్ల తినడం వల్ల బ్లడ్‌ షుగర్ నియంత్రణలో ఉంటుందని అంటున్నారు. దీంతో పాటు అంజీర్​లను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా కాపాడుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

2 / 6
డయాబెటిక్‌ బాధితులు అంజీర్ పండ్లను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు అంటున్నారు. అంజీర్ పండ్లలో పొటాషియం పోషకాలు ఎక్కువగా ఉంటాయని.. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

3 / 6
అంజీర్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు స్థాయులను సరిగ్గా ఉంచేలా సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. అత్తి పండ్లను తినడం వల్ల శరీరంలో పెరిగిన ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. కరోనరీ ధమనుల్లో అడ్డంకులను నివారిస్తుందని.. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు.

4 / 6
ప్రతిరోజూ పరగడపున అంజీర్ పండ్లను తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య తొలగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఉన్న మహిళలు, రుతుక్రమ సమస్యలతో బాధపడే అమ్మాయిలు హార్మోన్ల అసమతుల్యత సమస్యల బారిన పడుతూ ఉంటారు. వారంతా కచ్చితంగా అంజీర్ పండ్లను తింటే మంచిదని సూచిస్తున్నారు.

5 / 6
రెండు అంజీర్లను రాత్రి నిద్రపోయే ముందు నీటిలో నానబెట్టాలి. వీలైతే వాటిలో బాదం, వాల్ నట్స్ కూడా వేసి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

6 / 6
అంజీర్ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ పరగడుపునే నానబెట్టిన రెండు అంజీర్ పండ్లను తినాలని సూచిస్తున్నారు. ఇవి ప్రేగు కదలికలను సరిచేసి.. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయని వివరిస్తున్నారు. అలాగే, పొట్ట ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని అంటున్నారు.