Health Tips: ఆరోగ్యానికి మేలు చేసే జంక్ ఫుడ్స్.. పరిమితిగా తింటే మీ గుండె కూడా సురక్షితం.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..

|

Aug 29, 2023 | 8:33 PM

Health Tips: ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుంది. వీటి కారణంగానే డయాబెటీస్, బీపీ, గుండె పోటు, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని రకాల జంక్ ఫుడ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని పరిమితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఇంతకీ ఆరోగ్యానికి మేలు చేసే ఆ జంక్ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
చూయింగ్ గమ్: చూయింగ్ గమ్ కూడా టైం పాస్‌గా తీసుకునేదే. దీన్ని నమలడం వల్ల దవడలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు పిప్పు పన్ను సమస్య దూరం అవుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇంకా మెడదు పనితీరు కూడా మెరుగుపడుతుంది.

2 / 5
ఐస్ క్రీమ్: ఐస్ క్రీమ్‌ని ఇష్టపడనివారు ఉండరు. అయితే ఐస్ క్రీమ్‌ని పరిమితంగా తీసుకోవడం వల్ల ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ప్రోబయోటిక్స్ వంటి పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఫలితంగా తక్షణ శక్తి, బలమైన ఎముకలు, కేశ సమస్యలకు పరిష్కార లాభాలను పొందవచ్చు.

3 / 5
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌ని తినడానికి అందరూ ఇష్టపడతారు. దీన్ని పరిమితంగా తీసుకుంటే డయాబెటీస్‌తో బాధపడేవారికి షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే దీనిలోని యాంటీఆక్సడెంట్లు, పోషకాలు దంత సమస్యలను దూరం చేయడంతో పాటు హృదయ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

4 / 5
పాప్ కార్న్: పాప్‌కార్న్ అనేది టైమ్ పాస్ ఫుడ్. ఈ కారణంగానే ప్రయాణ సమయంలో ముఖ్యంగా సినిమా చూస్తున్న సమయంలో అందరూ ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఇక ఈ పాప్‌కార్న్‌ని తృణధాన్యాల నుంచి తయారు చేయడం వల్ల జీర్ణసమస్యలు దూరమవుతాయి. ఇంకా ఇందులోని ఫైబర్ డయాబెటీస్ రోగులకు కూడా మేలు చేస్తుంది.

5 / 5
స్వీట్: మధుమేహంతో బాధపడేవారు స్వీట్స్ తీసుకోకూడదు. కానీ రుచి కోసం చాలా తక్కువ సందర్భాల్లో తినవచ్చు. ఇక సాధారణ వ్యక్తులు కూడా తక్కువ మోతాదులోనే స్వీట్స్ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. వీటిల్లోని కాల్షియం కారణంగా ఎముకలు బలోపితం అవుతాయి. ఇంకా మీ మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.