Liver Health: కాలేయం ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు.. తిన్నారంటే ఆ సమస్యకు చెక్ పెట్టినట్లే..!

|

Aug 27, 2023 | 7:59 AM

Liver Health: మన శరీరంలోని కొన్ని అవయవాలు అత్యంత ప్రధానమైనవి. వాటిపై చెడు ప్రభావం పడినా, వాటి పనితీరు సరిగ్గా లేకపోయినా ప్రాణాపాయం తప్పదు. అలాంటి అవయవాల్లో గుండె, మెడదు, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటివి ఉన్నాయి. వీటిల్లో కాలేయం జీర్ణక్రియ, పోషకాహార నిల్వ కోసం పనిచేస్తుంది. అంటే కాలేయం సరిగ్గా పనిచేయకపోతే జీర్ణక్రీయకు ఆటంకం కలిగి శరీరానికి శక్తి అందదు. అలాగే ప్రస్తుత కాలంలో చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అందువల్ల కాలేయం ఆరోగ్యం, ఇంకా ఫ్యాటీ లివర్ నుంచి బయట పడేందుకు ఆహారంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవేమిటంటే..

1 / 5
కూరగాయలు: కాలేయం ఆరోగ్యం కోసం ఆకు కూరలు, కాయ కూరలను తీసుకోవాలి. ముఖ్యంగా బచ్చలికూర, కాలే వంటి వాటిల్లోకోరోఫిల్ ఉంటుంది. ఇది డిటాక్సేషన్ కోసం, అలాగే కాలేయం పనితీరును మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఇవే కాక కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్లు, పోషకాల కారణంగా శరీరానికి మేలు చేస్తాయి.

2 / 5
బ్రోకలీ: బ్రోకల్లీ కాలేయంలోని విష పదార్థాలను తొలగించగలిగే గ్లూకోసినోలేట్స్‌ని కలిగి ఉంది. ఇది ఆహారంలోని హానికరమైన పదార్థాలను విచ్ఛిన్నం చేసి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం సహాయపడుతుంది. ఇంకా బ్రోకల్లీలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

3 / 5
విత్తనాలు: గుమ్మడి, పుచ్చకాయ విత్తనాలు.. అలాగే బాదం, జీడిపప్పు, వాల్నట్స్‌ వంటివాటిని తీసుకోవడం వల్ల కూడా కాలేయానికి మేలు జరుగుతుంది. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కాలేయం పనితీరును మెరుగుపరచడమే కాక, దాని ఆరోగ్యాన్ని కాపాడతాయి.

4 / 5
వెల్లుల్లి: వెల్లుల్లి కాలేయం కోసమే కాక సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని సల్ఫర్ సమ్మేళనాలు కాలేయ ఎంజైములను సక్రియం చేసి టాక్సిన్స్‌ను సులభంగా తొలగిస్తాయి. ఫలితంగా కాలేయం సురక్షితంగా ఉంటుంది.

5 / 5
చేప: చేపల్లోని కొవ్వు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సాల్మన్, సార్డినెస్‌ చేపల్లో ఓమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా ఇవి కాలేయం పనితీరుతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.