
కావాల్సిన పదార్థాలు : చికెన్, బాస్మతి రైస్, కొత్తి మీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, జాపత్రి, స్టార్ అనాస, యాలకులు, లవంగాలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు , పెరుగు, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో, దాల్చిన చెక్క, నెయ్యి.

Biryani

తర్వాత మరో బౌల్ తీసుకోవాలి. అందులో కొలతప్రకారం బాస్మతి రైస్ తీసుకోవాలి. తర్వాత వాటిని ఒకసారి శుభ్రంగా కడిగి, అందులో కొన్ని నీరు పోసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి, ఓ కడాయి పెట్టాలి. అందులో సరిపడ నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడి అయ్యాక, అర టీస్పూన్ షాజీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మూడు లేదా ఐదు లవంగాలు, జాపత్రి మూడు బిర్యానీ ఆకులు, 5 యాలకులు రెండు స్టార్ అనాస పువ్వు, మూడు పచ్చి మిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత టమోటోను కాస్త పెద్దగా కట్ చేసి, అందులో వేయాలి.

తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్‌ను వేయించుకునే కడాయిలో వేయాలి. తర్వాత దీనిని 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసి కుక్కర్ మూత పెట్టేయ్యాలి. అంతే టూ విజిల్స్ వచ్చిందంటే స్పైసీ స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ.