మెత్తని చపాతీ తినడానికి ఎవరు ఇష్టపడరు! శీతాకాలంలో వేడి వేడి చపాతీ తింటే ఆ మజానే వేరు. చపాతీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చపాతీ తినడం వల్ల మలబద్ధకం సమస్య సులభంగా తొలగిపోతుంది. అంతేకాకుండా చపాతీలో ఫోలేట్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పొటాషియంతోపాటు కొంత మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది.