
గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిన్న బెల్లం ముక్క కలిపి కలిపి త్రాగినప్పుడు, దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీరు అసిడిటీ సమస్యతో బాధపడుతుంటే, వేడి నీటిలో బెల్లం కలిపి తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.

బెల్లంలో విటమిన్ బి1, బి6, సి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, శక్తి, చక్కెర, కార్బోహైడ్రేట్, సోడియం వంటి అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఏదో ఒక విధంగా శరీరానికి మేలు చేస్తాయి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో రక్త లోపాన్ని నివారిస్తుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బెల్లం నీరు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డీటాక్సిఫికేషన్- బెల్లంలోని పొటాషియం టాక్సిన్స్, అదనపు ఫ్లూయిడ్స్ ను బయటకు పంపి, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బెల్లంలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది.

ఉదయాన్నే బెల్లం నీరు తాగితే శరీర శక్తి పెరుగుతుంది. బెల్లంలోని వెచ్చని లక్షణాలు గొంతుకు ఉపశమనం కల్పిస్తాయి. దగ్గు, కంజెషన్,ఉబ్బసం, బ్రోన్కైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. బెల్లం నీరు జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఆకలిని తగ్గించి బరువు నిర్వహణలో తోడ్పడుతుంది.

బెల్లంలోని ఐరన్ కంటెంట్ రుతు తిమ్మిరి, ఉబ్బరం, మూడ్ స్వింగ్‌లను తగ్గిస్తుంది. మీరు 1-2 టీస్పూన్ల బెల్లం పొడి లేదా ఒక చిన్న ముక్కను వెచ్చని నీటిలో కలపాలి. బెల్లం నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. అంతేకాదు.. బెల్లంలోని సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఇది మీరు రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది.