
కాకరకాయ అనే పేరు వినగానే చాలా మంది తినడానికి భయపడతారు. అది చేదుగా ఉండడమే అందుకు కారణం. కానీ చలికాలంలో కాకరకాయ రసం తాగడం చాలా ప్రయోజనకరం.

కాకరకాయ చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అందుకే దీనిని తినేందుకు అందరూ తప్పక ప్రయత్నించాలి. ఇంకా చలికాలంలో కాకర తీసుకోవడం లేదా రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ కాకరకాయ జ్యూస్ చేయడానికి పెద్దగా శ్రమ పడనవసరం లేదు. ఇంట్లో లభించే పదార్థాల సహాయంతో ఈ రసాన్ని త్వరగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం కాకరకాయలను బాగా కడగి, ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఆ ముక్కలు, కొద్దిగా అల్లం, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి రుచికి అనుగుణంగా నీరు కలపండి.

మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే, అది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే పొట్ట కూడా శుభ్రం అవుతుంది.

కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. కాబట్టి చర్మ సంబంధిత సమస్యలు మీ దరిచేరవు.