Sleep for Brain Health: మీరూ 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ బ్రెయిన్‌ డేంజర్‌లో ఉన్నట్లే

|

Dec 26, 2024 | 1:39 PM

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం, వ్యాయామం ఎంత అవసరమో తగినంత నిద్ర కూడా అంతే అవసరం. అవును.. రోజంతా చేసిన శ్రమ వల్ల శరీరం అలసిపోతుంది. దీనిని తనకు తాను రిపేర్ చేసుకోవడానికి నిద్ర సమయం ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది నేటి కాలంలో నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి త్వరలోనే మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

1 / 5
ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా చక్కని జీవనశైలిని పాటించాలి. ఆరోగ్యకరమైన జీవనానికి మంచి అలవాట్లు అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెగ్యులర్ వ్యాయామం, సరైన ఆహారంతోపాటు కంటి నిండా నిద్ర కూడా చాలా అవసరం.

2 / 5
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. అయితే చాలామందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. సరిగ్గా నిద్రపోకపోతే శరీరం అలసిపోతుంది. రోజుకు సరిపడా నిద్ర పోకపోతే అది మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఏ వయసులో ఎంత నిద్ర అవసరమో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
స్పెషలిస్ట్ కార్డియాక్ సర్జన్ (నైరానా-RN ఠాగూర్ హాస్పిటల్) డాక్టర్ అటాను సాహా మాట్లాడుతూ.. ప్రతి మనిషికీ నిద్ర చాలా అవసరం. అయే ప్రతి వయస్సులో ఒకేలా నిద్ర గంటలు ఉండవు. పొత్తిళ్లలోని శిశువు 24 గంటలలో 14 గంటలు నిద్రపోతుంది. ఇది వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ నిద్ర సమయం కూడా తగ్గుతుంది.

4 / 5
కొంత మంది యువకులు 10-12 గంటలు నిద్రపోతారు. వయసు పెరిగే కొద్దీ నిద్ర గంటలు తగ్గుతూ ఉండాలి. యుక్త వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని పరిశోధనలు చెబుతున్నాయి. లేదంటే మెదడు దెబ్బతింటుంది.

5 / 5
కార్డియాక్ సర్జన్ అటాను సాహా మాట్లాడుతూ.. మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోకపోతే, మెదడు న్యూరాన్లు నెమ్మదిగా చనిపోతాయి. రోజంతా పని చేయడం వల్ల ఒత్తడి మెదడును ప్రభావితం చేస్తుంది. నిద్ర మరుసటి రోజుకు మెదడును రీసెట్ చేస్తుంది. అయితే సరిగ్గా నిద్రపోకపోతే షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ సమస్యలు, నరాల సమస్యలు వస్తాయి. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా 60-70 ఏళ్లలో వచ్చే ప్రమాదం ఉంది.