చింతకాయ పచ్చడి అంటే ఇష్టమా.? టేస్టీగా మీ కిచెన్‎లోనే సిద్ధం..

Updated on: Dec 08, 2025 | 7:51 PM

చింతకాయ చాలా పుల్లగా ఉంటుంది. అయినప్పటికీ.. చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. దీనితో పులుసు, కూరలు, పచ్చళ్ళు చేసుకోను తింటారు. అయితే రుచికరంగా, నోరూరించేలా చింతకాయ పచ్చడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.. ఇది తిన్నారంటే ఆహా ఏమి ఈరోజు అని అంటారు.

1 / 5
చింతకాయ పచ్చడి తయారు చేయడానికి  అరికిలో పచ్చి చింతకాయలు, అయిదు పచ్చి మిర్చి, ఒక కప్పు కొత్తిమీర తరుము, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను బెల్లం తరుగు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను మినపప్పు,  ఆరు ఎండుమిరప కాయలు,  గుప్పెడు కరివేపాకులు,  అర స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు  కావాల్సిన పదార్థాలు.

2 / 5
ముందుగా తాజాగా ఉన్న పచ్చి చింతకాయలు తీసుకొని వాటిని  శుభ్రంగా కడిగి పెచ్చులను తీసి, ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని వేయించకుండా పచ్చిగానే మిక్సీ లేదా గ్రైండర్‎లో పచ్చి చింతకాయలతో పాటు  కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.

3 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఓ కడాయి పెట్టుకోండి. అందులో కుంచం నూనె వేసి మరగనివ్వాలి. తర్వాత ఆ కడాయిలో జీలకర్ర, ఆవాలు వేసి కొండసేపు చిటపటలాడించాలి. తర్వాత తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు కూడా వేసి ఫ్రై చెయ్యాలి. వీటిలోనే ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి.

4 / 5
చివరిగా అందులో పసుపు, కరివేపాకులు వేసి గరిటతో బాగా కలుపుకోవాలి.తర్వాత స్టవ్ చిన్న మంట మీద ఉంచి ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుతూ ఉండాలి. రెండు నిమిషాలు అలానే చేస్తూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఓ గిన్నెలోకి తీసుకోండి. అంతే నోరూరించే చింతకాయ పచ్చడి తినడానికి రెడీ.

5 / 5
చింతకాయ పచ్చడి రుచి చూస్తే మీ ఇంట్లో అందరూ అదిరిపోయింది అంటారు. మీకు స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపొకొని తిన్నారంటే వారెవ్వా అంటారు. కావాలంటే చపాతీ, రోటి వంటి వాటితో కూడా తినవచ్చు.