పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవు.. గ్యాప్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!

Edited By:

Updated on: Jan 20, 2026 | 12:07 PM

మనం ఎయిర్‌పోర్టులు, షాపింగ్ మాల్స్ లేదా మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పబ్లిక్ టాయిలెట్లను గమనించే ఉంటాం. వాటి తలుపులు సాధారణ ఇంటి తలుపుల్లా కాకుండా, నేలకి కొంచెం ఎత్తులో ఉంటాయి. కింద చాలా గ్యాప్ కనిపిస్తుంది. చాలామంది ఇది కేవలం డిజైన్ అనుకుంటారు, మరికొందరు ప్రైవసీకి భంగం కలుగుతుందని భావిస్తారు. కానీ, ఈ గ్యాప్ వెనుక అద్భుతమైన ఇంజనీరింగ్ మరియు భద్రతా కారణాలు ఉన్నాయని మీకు తెలుసా?

1 / 5
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణ: పబ్లిక్ టాయిలెట్లలో ఎవరైనా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినా లేదా గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలకు గురైనా, తలుపులు పూర్తిగా మూసి ఉంటే బయట ఉన్నవారికి ఆ విషయం తెలియదు. అదే కింద ఖాళీ ఉంటే, లోపల వ్యక్తి పడిపోయిన విషయం వెంటనే గమనించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.

2 / 5
మెరుగైన పరిశుభ్రత: పబ్లిక్ టాయిలెట్లను రోజుకు పదుల సంఖ్యలో క్లీన్ చేయాల్సి ఉంటుంది. తలుపులు నేల వరకు ఉంటే ప్రతి గదిని విడివిడిగా క్లీన్ చేయడం కష్టం. అదే గ్యాప్ ఉంటే, మాప్‌లు , వాటర్ పైపులు సులభంగా లోపలికి వెళ్తాయి. దీనివల్ల నీరు నిల్వ ఉండకుండా త్వరగా ఆరిపోతుంది.

3 / 5
 గాలి వెలుతురు: చిన్న గదుల్లో దుర్వాసన ఎక్కువగా పేరుకుపోతుంది. తలుపు కింద, పైన ఖాళీ ఉండటం వల్ల గాలి ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల లోపల తేమ, దుర్వాసన తగ్గి, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

4 / 5
 అసాంఘిక కార్యకలాపాల నిరోధం: తలుపులు పూర్తిగా మూసి ఉంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఖాళీ ఉండటం వల్ల లోపల ఎవరైనా డ్రగ్స్ తీసుకోవడం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఒక రకమైన మానసిక భయం ఉంటుంది. ప్రైవసీని దెబ్బతీయకుండానే నిఘా ఉంచడానికి ఇది ఒక మార్గం.

5 / 5
తక్కువ ఖర్చు - ఎక్కువ కాలం: పూర్తి స్థాయి తలుపుల కంటే ఈ సగం తలుపుల తయారీకి మెటీరియల్ తక్కువ పడుతుంది. అలాగే, వీటిని అమర్చడం సులభం. నేలకు తగలకుండా ఉండటం వల్ల తేమ తగిలి తలుపులు త్వరగా పాడైపోయే అవకాశం కూడా ఉండదు.కాబట్టి ఇకపై పబ్లిక్ టాయిలెట్లలో ఆ గ్యాప్ చూస్తే అది డిజైన్ లోపం అని అనుకోకండి.. అది మీ భద్రత మరియు సౌకర్యం కోసం చేసిన స్మార్ట్ ప్లానింగ్ అని గుర్తుంచుకోండి.