
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు, అయితే తెలుగు రైతులు వ్యవసాయం ఆధారంగా వాటిని 27 కార్తెలుగా పిలిచేవారు. ఇప్పటికీ ఆదే పాటిస్తున్నారు.అయితే సూర్యుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా వచ్చినప్పుడు మృగశిర కార్తె ప్రారంభ అవుతుంది. ఈ కార్తె ప్రారంభం చిరుజల్లులతో మొదలవుతుంది. ఒక్కసారిగా ఉన్నట్లుండి వాతావరణం చల్లబడుతుంది.

అందుకే ఈ మృగశిర కార్తె వస్తే శరీరంలో వేడి పెంచడానికి చేపలు తినాలంటారు పెద్ద వారు. దీని వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా హానికరమైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. మరీ ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది అంటారు.

ఇక ఎవరికైనా సరే మృగశిర కార్తె అంటే చేప ప్రసాదమే గుర్తు వస్తుంది. ఈ రోజున పలు ప్రదేశాల్లో చేప ప్రసాదం పంపిణిచేస్తారు. ఆస్తమా, ఉబ్బసం, వంటి సమస్యలతో బాధపడే వారు మృగశిర రోజు చేప ప్రసాదం తింటే ఉపశమనం కలుగుతుందని ప్రజల నమ్మకం. అందుకే ఆ రోజు కొన్ని వేల మంది చేప ప్రసాదం కోసం బారులు తీరుతారు.

Fish Prasadam 2

అయితే మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం పంపిణీ చేయడం వలన మాత్రమే ఆ చేప ప్రసాదం సరిగ్గా పని చేస్తుందని ప్రజల నమ్మకం. అంతే కాకుండా ఆరోజుతోనే మృగశిర ప్రారంభం అవుతుంది కాబట్టి, ఆరోజు తీసుకోవడమే ఆరోగ్యానికి చాలా మంచిదంట.