
కైలాష్ మానసరోవర్: మత విశ్వాసం ప్రకారం, టిబెట్‌లో ఉన్న కైలాస మానసరోవర్‌ను ఆ శివపార్వతుల నివాసంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, ఇది శివుడు నివసించే పవిత్ర స్థలం. కైలాస మానస సరోవరం ప్రస్తావన శివపురాణంలో ఉంది.

Adi Kailash-ఆది కైలాష్ : ఆది కైలాసం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఈ కైలాసాన్ని రుంగ్ సమాజంతో సంబంధం ఉన్న ప్రజల ప్రధాన ప్రదేశంగా భావిస్తారు. రుంగ్ సంప్రదాయం ప్రకారం, ఆది కైలాసం మహాదేవుని అసలు నివాసం. ఇక్కడికి సాధువులు, ఇతర వ్యక్తులు రావడం వల్ల మహాదేవ్ తపస్సుకు భంగం కలిగిందని, దాని కారణంగా మహాదేవ్ ఈ ప్రదేశం విడిచి వెళ్ళాల్సి వచ్చిందని నమ్ముతారు.

Kinnaur Kailash-కిన్నౌర్ కైలాష్: కిన్నార్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కిన్నార్ కైలాష్ యాత్ర అమర్‌నాథ్, మానసరోవర్ యాత్ర కంటే కష్టతరమైనదిగా చెబుతారు..కిన్నౌర్ కైలాష్ మహాదేవ్ భక్తులకు ఒక ముఖ్యమైన ప్రదేశం.

Mani Mahesh Kailash- మణిమహేష్ కైలాష్: మణిమహేష్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటుంది. ఈ ప్రదేశంలో శివలింగం ఆకారంలో ఉన్న ఒక రాయి ఉంటుంది. దీనినే ఆ మహాదేవ్ రూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, పార్వతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత శివుడు మణిమహేష్ కైలాసాన్ని నిర్మించాడని చెబుతారు.

Shrikhand Kailash- శ్రీఖండ్ మహాదేవ్ కైలాష్: శ్రీఖండ మహాదేవ్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఈ కైలాసం మహాదేవ్ మతపరమైన ప్రదేశాలలో ఎత్తైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ పర్వతం సముద్ర మట్టానికి 18,300 అడుగుల ఎత్తులో ఉంది. పురాణాల ప్రకారం, లోక రక్షకుడైన విష్ణువు, శ్రీఖండ్ మహాదేవ్ కైలాసం వద్ద భస్మాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు.