ఘోర ప్రమాదంతో దేశం మొత్తం కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇండియన్ రైల్వేలో కోరమండల్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 46 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ రైలు.. భారత రైల్వే చరిత్రలోనే అత్యధిక స్పీడ్‌తో తీసుకొచ్చిన మొదటి రైలుగా పేరుగాంచింది.
చెన్నై నుంచి పశ్చిమబెంగాలోని హౌరాకు వెళ్లే ఈ రైలు స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లతో దూసుకుపోతుంది. ఈ రైలు మొత్తం నాలుగు రాష్ట్రాలను (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్) కవర్ చేస్తూ వెళ్తుంది. మొత్తం 25 గంటల్లో 16 వందల 61 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
ఉదయం తొమ్మిది గంటలకు చెన్నైలో ప్రారంభమయ్యే రైలు నాన్‌స్టాప్‌గా 431 కి.మీలు ప్రయాణించి విజయవాడ చేరుకుంటుంది. అయితే మధ్యలో ఒంగోలులో టెక్నికల్ చెకింగ్ కోసం మాత్రమే ఆగుతుంది. అక్కడ టికెట్ ఇష్యూ ఉండదు.
కోరమండల్ రైలు బయలుదేరితే మిగతా అన్నీ రైళ్లను క్రాసింగ్‌లో పెడతారు. ఈ రైలు అధిక ప్రాధాన్యత కలిగిన రైళు కింద పరిగణిస్తారు. ఏపీలో విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నంలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.
మొదట్లో వారానికి రెండు సార్లు మాత్రమే ఈ రైలు నడిచేది. అయితే తర్వాత పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రతిరోజూ ఈ సర్వీస్ నడుపుతున్నారు.