Winter Health: చలికాలంలో నారింజ పండ్లు రోజూ తింటే ఏం జరుగుతుందంటే..!

|

Jan 13, 2024 | 8:21 AM

చలికాలంలో నారింజలు మార్కెట్లో ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటాయి. అయితే, చలికాలంలో నారింజ తినడం మంచిదేనా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. వీటి వల్ల జలుబు, దగ్గు వచ్చే సమస్య ఉంటుందని అనుకుంటారు. కానీ, నారింజ పండ్లను వింటర్‌లో తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. జ్యూస్‌ కంటే పండ్లను తినడం వల్ల అధిక ప్రయోజనాలు అందుతాయని అంటున్నారు. చలికాలంలో నారింజ పండు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
నారింజలో ఉండే బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సీ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇందులోని ఫైబర్‌ కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. శరీర బరువును కంట్రోల్‌ చేస్తాయి. కంటి సమస్యలు సులభంగా దూరం చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది నారింజలను ఎక్కువగా తీసుకుంటారు.

2 / 5
ఆరెంజెస్‌లో ఎక్కువగా విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. ఇది మీ చర్మాన్ని దృఢంగా, సాగకుండా ఉంచడంలో సాయపడుతుంది. ఇది సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది. గాయాల్ని తగ్గేలా చేస్తుంది. నారింజ మంచి సిట్రస్ ఫ్రూట్. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

3 / 5
నారింజలో విటమిన్ సితో పాటు విటమిన్ సి ఫోలేట్, బి విటమిన్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకి కూడా ఇది ఎంతో అవసరం. కాగా నారింజలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది గుండెకి చాలా మంచిది. పొటాషియం రక్తపోటుని నియంత్రించడంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలోకి కొలెస్ట్రాల్‌ శోషణని స్థాయిలని తగ్గిస్తాయి.

4 / 5
మీరు కొలెస్ట్రాల్ వ్యాధితో బాధపడుతుంటే మీరు నారింజ తినాలి. నారింజ పండ్లను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీ బరువు తగ్గించుకోవాలనుకుంటే ఆరెంజ్ గ్రేట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అదనపు కేలరీలు తీసుకోకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

5 / 5
ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో ఎక్కువ కృత్రిమ చక్కెరలు లేకుండా నారింజలోని సహజ చక్కెరలు కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇస్తాయి. నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్నాయి. ఇందులో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడుతుంది. ఈ పండ్లని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు దూరమవుతాయి నారింజని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలపై ప్రమాదకరమైన ప్రభావాన్ని తగ్గిస్తుంది.