
బంగారానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత దేశంలో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే భారతాయ మహిళలు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడటమే కాకుండా వీరు బంగారు ఆభరణాలు ధరించడం కూడా తమ సాప్రదాయంలో ఒక భాగంగా భావిస్తారు. అదే విధంగా బంగారాన్ని తమ ఆస్తిగా కూడా భావిస్తారు. కష్టకాల సమయంలో ఇది వారికి చాలా ఉపయోగపడుతుంది అని వారి నమ్మిక. అందుకే మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు.

Gold

అందుకే పండితులు దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా శుభప్రదం అంటారు. అలాగే చాలా మంది ఈరోజుల్లో బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. అయితే ఇదే కాకుండా వారం రోజుల్లో బంగారాన్ని ఏరోజు కొటే కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పండితులు, శాస్త్రాల ప్రకారం, బంగారం కొనడానికి గురు వారం లేదా, ఆది వారం చాలా మంచిదంట. ఎందుకంటే, బంగారం అనేది సూర్యుడు, బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది.

అందువలన ఈ రోజుల్లో బంగారం కొనడం వలన మీ జాతకం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మీ జాతకంలోని గురు, సూర్య గ్రహాల స్థానాన్ని బలపరుస్తుంది అంటున్నారు పండితులు. అలాగే పుష్య నక్షత్రం కనిపించే రోజున బంగారం కొనడం కూడా చాలా శుభప్రదం. ఈ నక్షత్రంలో బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు, ఇంట్లో శ్రేయస్సు వస్తుందని ప్రజల నమ్మకం.

అయితే శని వారం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో బంగారం కొనుగోలుచేయకూడదంట. ఎందుకంటే శని, సూర్యులు బద్ధశత్రువులు. దీని వలన ఇంట్లో అశాంతి నెలకొంటుందంట.