
కావాల్సిన పదార్థాలు : చికెన్ కేజీ, పెరుగు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్స్, నిమ్మరసరం, రెంటు టీ స్పూన్స్, కారం రుచికి సరిపడ, ఉప్పు రుచికి సరిపడ, మిరియాల పొడి చిటికెడు, మసాలా వన్ టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె వేయించడానికి సరిపడ, చీజ్ స్లైస్‌లు, కోడి గుడ్లు మూడు, పాలు కప్పు, వెల్లుల్లి, కొత్తిమీర, పూదీన.

తయారీ విధానం : ముందుగా బౌల్ తీసుకోవాలి. అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, నిమ్మరసం, చిటికెడు పసుపు , రుచికి సరిపడ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

తర్వాత చికెన్ తీసుకొని ముందుగా దీనిని శుభ్రంగా కడగాలి. తర్వాత తడి లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత చికెన్ పెద్ద సైజు ముక్కల మధ్యలో చిన్న చిన్నగా గాట్‌లు పెట్టుకోవాలి. అచ్చం మిర్జీ బజ్జీల విధంగా, తర్వాత ఆ గాట్‌లు పెట్టుకున్న మధ్యలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని లోపలి వరకు పెట్టాలి.

దీని తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో మూడు కోడి గుడ్లు, వెల్లుల్లి రెబ్బలు, చిజ్, పెరుగు, పాలు, ఉఫ్పు వేసి మెత్తగా గ్రైన్ చేసుకోవాలి.దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి, నూనె మంచి గా వేడి చేసుకోవాలి. దీని తర్వాత నూనెలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పీస్‌లను బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టి, అందులో వేయించిన చికెన్ ముక్కలను వేసి, అలాగే గ్రైన్ చేసుకున్న కోడి గుడ్ల , వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చికెన్ మిశ్రమంపై కొత్తిమీర, పూదీన వేయాలి. అంతే దుబాయ్ స్పెషల్ ఇప్ఫా చికెన్ రెడీ.