ఆసియాటిక్ సింహం పాంథెరా లియో లియో జాతికి చెందినది. ఇవి ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే జీవించి ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుండి దీని పరిధి గిర్ నేషనల్ పార్క్, గుజరాత్ రాష్ట్రంలోని పరిసర ప్రాంతాలకు పరిమితం చేయబడింది. చారిత్రాత్మకంగా, వీటి ఉనికి మధ్యప్రాచ్యం నుంచి ఉత్తర భారతదేశం వరకు ఉండేది.
నాన్నా.. సింహం సింగిల్‌గా రాదు, తన సైన్యంతో వేటాడుతుంది. అందుకే అది అడవికి రారాజు. సింహం ఎప్పుడూ ఒంటరిగా నడవదు. తన సహచరులతో కలిసి నడుస్తుంది, దీనినే 'లయన్స్ ప్రైడ్' గా చెప్తారు. వేట కూడా సింహాలు బృందంగా వేటాడుతాయి. కలిసి ఆహారాన్ని తింటాయి. ఆ బృందానికి ఒక మగ సింహం నాయకత్వం వహిస్తుంది. ఒక్క సింహం మాత్రమే మృగరాజుగా.. 'కింగ్ ఆఫ్ ద జంగల్' గా కీర్తి గడిస్తుంది. అందుకే.. ద లయన్ ఈజ్ ఆల్వేజ్ కింగ్!
సామజిక జీవనం, సింహాలు గుంపుగా ఉంటాయి. దానికి ఒక సింహం నాయకుడిగా వ్యవహరిస్తుంది. మిగిలినవన్నీ అనుసరిస్తాయి. మగ సింహం తమ భూభాగం విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తాయి. తమ ప్రాణాలు వదిలేస్తాయి గానీ వేరే జంతువు ఆ చుట్టుప్రక్కల ఆక్రమిస్తే ఊరుకోవు. ఒక రాజులా కాపాడుకుంటాయి.
సింహగర్జన : అన్ని జంతువులకి అత్యంత భయాన్ని కలిగించేది సింహగర్జన, ఇది నాలుగు కిలోమీటర్ల దూరం వినపడుతుంది. ఆ ప్రదేశం మొత్తం దద్దరిలుతుంది.
సింహం దంతాల వాస్తవాలు: అడవి రాజు గురించి చాలా కథలు ఉన్నాయి. సింహానికి సంబంధించిన అనేక వాస్తవాలు ఉన్నాయి. వాటి గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఐతే ఈరోజు మనం సింహం దంతాల గురించి తెలుసుకుందాం...
సింహం వేటకు ప్రసిద్ధి చెందింది. దాని పదునైన దంతాల కారణంగా ఇది సాధ్యమవుతుంది. సింహానికి మొత్తం 30 దంతాలు ఉంటాయి. అందులో 4 దంతాలు మనకు బయటకు కనిపిస్తాయి.
సింహం దంతాలు చిన్నవి, కానీ అవి కొద్దిగా వెడల్పుగా ఉంటాయి. సింహాలు చాలా బలమైన దవడ కండరాలను కలిగి ఉంటాయి. ఇది వేటలో సహాయపడుతుంది. సింహం దంతాలు 1,000 PSI వరకు శక్తిని కలిగి ఉంటాయి.