
స్వీట్స్ అంటే అందరికీ నోరు ఊరి పోతుంది .. అలాంటిది ఇక్కడ చేసే ఓళిగలు అంటే అందరూ లొట్టలేసుకొని తినాల్సిందే .. అంత బాగుంటాయి మరి, ఇక్కడ తయారైన ఓళిగకు ప్రత్యేక స్థానం ఉంది ఆ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, జిల్లాలు దాటి రాష్ట్రాలు, రాష్ట్రాలు దాటి విదేశాలకు కూడా ఇక్కడ ఓళిగ వెళ్లి చేరుతుందంటే అది ఎంత ఫేమసో దానికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు,ఇంతకీ ఏమిటా ఓళిగ ఎక్కడ తయారుచేస్తారు అనే కదా.. రీడ్ దిస్.

కడప జిల్లా ప్రొద్దుటూరులో చేసే ఓళిగలకు మంచి డిమాండ్ ఉంది సాధారణంగా ప్రొద్దుటూరు వాణిజ్య రాజధాని.. బంగారం, వస్త్ర వ్యాపారు ఇక్కడ కోట్లలో జరుగుతాయి.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ బంగారం, వస్త్రాలను కొనుగోలు చేస్తూ ఉంటారు ప్రొద్దుటూరులో ఇవి ఎంత ఫేమసో ఇక్కడ తయారయ్యే ఓళిగా కూడా అంతే ఫేమస్, ప్రొద్దుటూరు వచ్చినవారు ఓళిగ తినకుండా వెళ్ళరు అంటే అతిశయోక్తి కాదు.

మనం తినే పూర్ణం ఎలా ఉంటుందో ఓళిగా కూడా అంతే రుచిగా ఉంటుంది..అందులో పూర్ణం, కానీ కవ్వా కానీ పెట్టి తయారుచేస్తారు. ఇందులో అనేక రకాల ఓళిగలు ఉన్నాయి కవ్వా ఓళిగ, ముద్ద ఓళిగ, క్యారెట్ ఓళిగ, పేపర్ ఓళిగ, కొబ్బరి ఓళిగ ఇలా రకరకాల ఓలిగలు ఉన్నాయి.. ఇందులో కొబ్బరి, జీడిపప్పు, పూర్ణం, గసాలు, పాలకోవా, క్యారెట్, పెనీ రవ్వ, బెల్లం, చక్కెర, శెనగపప్పు, నెయ్యి వాడతారు.

ఇలా తయారుచేసిన ఓళిగలు ఎంతో రుచిగా మధురంగా ఉండటంవల్ల ప్రతి ఒక్కరు వీటిని ఆస్వాదిస్తారు. ప్రొద్దుటూరు ప్రాంతమే కాక కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఓళిగలకు సంబంధించిన తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఓళిగల తయారీ కర్మకారాలలో మాత్రం ఇవి ఎక్కువగా తయారయ్యి దేశ విదేశాలకు రవాణా అవుతున్నాయి.

కడప జిల్లాకు మాత్రమే కాకుండా పక్కనే ఉన్న కర్నూల్, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలకే కాకుండా పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, చెన్నై రాష్ట్రాలకు కూడా ఇక్కడి ఓళిగలు రవాణా అవుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లా వాసులు ఎక్కువగా ఉన్న విదేశాలలో కూడా డిమాండ్ ఉంది. దుబాయ్, కువైట్, సౌదీ వంటి ప్రాంతాలే కాకుండా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశానికి కూడా ఇక్కడి ఓలిగలు వెళ్ళి వాటి రుచిని అందించాయంటే ఇవి ఎంత ఫేమసో అర్థమవుతుంది కదా.. ఇది కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో తయారయ్యే కమ్మటి ఓళిగ కథ.