
పండగలు వచ్చినా.. ఏవైనా స్పెషల్ డేస్‌లో.. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ముందుగా చేసేవి గారెలు. వీటినే వడలు అని కూడా పిలుస్తారు. ఈ గారెలతో పాటు చికెన్ కర్రీ తింటే ఆహా ఆ రుచే వేరు లెండి. వడలను చట్నీలతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. అల్లం పచ్చడితో తింటే టేస్ట్ వేరే లెవల్ అంతే.

వీటిని ఎక్కువగా తినాలని అనిపించినా.. ఆయిల్ కారణంగా తినడం తగ్గించేస్తారు. వీటిని చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తుంది. దీంతో ఇవి ఎంత రుచిగా ఉన్నా తినలేం. ఇకపై ఈ టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు ట్రై చేస్తే.. వడలు నూనె పీల్చకుండా వస్తాయి.

గారెలకు పిండి రుబ్బేటప్పుడు చాలా మంది చాలా మెత్తగా రుబ్బేస్తారు. దీంతో ఇవి నూనె పీల్చుతాయి. అలాగే ఇంకెంత మంది గట్టిగా రుబ్బేస్తారు. అలా రుబ్బితే గారెలు గట్టిగా వస్తాయి. కాబట్టి గట్టిగా కాకుండా.. మెత్తగా కాకుండా మీడియం రేంజ్‌లో రుబ్బండి.

చాలా మంది చేసే తప్పు ఏంటంటే. ఆయిల్ కొద్దిగా వేడిగా ఉంటే చాలు.. వడలు వేసేస్తారు. అలా కాకుండా ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే.. ఆయిల్ తక్కువగా పీల్చుతాయి. అలా అని మరీ పెద్ద మంట పెట్టకూడదు. చూ

గారెలను ఆయిల్ నుంచి తీయగానే ముందు టిష్యూ పేపర్, బటర్ పేపర్ లేదా కిచెన్ టవల్ మీద అయినా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే.. పీల్చుకుంటాయి. ఇలా చిన్న చిట్కాలతో వడలకు ఆయిల్ పట్టకుండా చేయవచ్చు.